Salaar Trailer: ప్రభాస్‌ ‘సలార్‌’ ట్రైలర్‌ వచ్చేసింది.. మరిన్ని అంచనాలు పెంచేలా..!

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన సినిమా ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది.

Updated : 01 Dec 2023 20:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడెప్పుడా?అని ప్రభాస్‌ (Prabhas) అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘సలార్‌ పార్ట్‌ 1- సీజ్‌ఫైర్‌’ ట్రైలర్‌ (Salaar Trailer) వచ్చేసింది. డిసెంబరు 22న సినిమాని విడుదల చేయనున్న సందర్భంగా చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను తీసుకొచ్చింది (Salaar Trailer Day). తెలుగు సహా ఐదు భాషల్లో ఈ ప్రచార చిత్రం సందడి చేస్తోంది. హీరో ఎలివేషన్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌, విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌.. ఇలా ప్రతిదీ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) మార్క్‌కు తగ్గట్లు ఉంది. 3 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచడం ఖాయమనిపిస్తోంది (Salaar Cease Fire). ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ పాత్రకు సంబంధించి బాల్య సన్నివేశాలతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. విడుదలైన 15 నిమిషాల్లోనే 17 లక్షల వ్యూస్‌ సొంతం చేసుకోవడం విశేషం. అంటే నిమిషానికి లక్షమందికిపైనే ఈ ట్రైలర్‌ను వీక్షించారు.

బద్ధ శత్రువులుగా మారే ఇద్దరు స్నేహితుల కథాంశంతో ‘సలార్‌’ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్‌ (salaar heroine) హీరోయిన్‌. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రతినాయకుడు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్‌, జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘సలార్‌’.. ‘కేజీయఫ్‌’ యూనివర్స్‌లోకి వస్తుందనే రూమర్స్‌పై ప్రశాంత్‌ నీల్‌ ఇటీవల స్పందించారు. రెండింటికీ సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని