Salaar: ‘సలార్‌’ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. ప్రభాస్‌ లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా.!

‘సలార్‌ పార్ట్‌1 సీజ్‌ ఫైర్‌’ (Salaar) నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ విడుదలైంది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ప్రభాస్ లుక్‌ పట్ల ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 12 Nov 2023 10:52 IST

హైదరాబాద్‌: స్టార్‌ హీరో ప్రభాస్‌ (Prabhas), దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prasanth neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సలార్‌ పార్ట్‌1 సీజ్‌ ఫైర్‌’ (Salaar). యాక్షన్‌ థ్రిల్లర్‌గా దీనిని తీర్చిదిద్దుతున్నారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 22న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఓ క్రేజీ అప్‌డేట్‌ విడుదలైంది. ఈ మేరకు ట్రైలర్‌ రిలీజ్‌ టైమ్‌ను టీమ్‌ ప్రకటించింది. దీని ప్రకారం డిసెంబర్‌ 1వ తేదీ రాత్రి 7.19 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో ప్రభాస్‌ ఓ వాహనంపై నిల్చొచి గన్‌ ఫైర్‌ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రభాస్‌ లుక్ పోస్టర్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. హొంబలే ఫిల్మ్స్‌ పతాకంపై ఇది నిర్మితమవుతోంది. శ్రుతిహాసన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని