Salaar: సందడి మొదలు కానుందా?

పలు వాయిదాల తర్వాత ఇటీవలే డిసెంబరు 22న అంటూ విడుదల తేదీని ఖరారు చేసింది ‘సలార్‌’ చిత్ర బృందం. అయితే తేదీ దగ్గర పడుతున్నా ప్రచార కార్యక్రమాలు మాత్రం ఊపందుకోలేదు.

Updated : 10 Nov 2023 09:33 IST

లు వాయిదాల తర్వాత ఇటీవలే డిసెంబరు 22న అంటూ విడుదల తేదీని ఖరారు చేసింది ‘సలార్‌’ చిత్ర బృందం. అయితే తేదీ దగ్గర పడుతున్నా ప్రచార కార్యక్రమాలు మాత్రం ఊపందుకోలేదు. దీంతో మరోసారి ఈ సినిమా విడుదలపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వాటికి తెర దించుతూ ట్రైలర్‌ విడుదలకి సిద్ధమైంది చిత్రబృందం. డిసెంబరు 1న ట్రైలర్‌ విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకొంటోంది. ప్రభాస్‌ కథానాయకుడిగా... ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా శ్రుతిహాసన్‌ నటించారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రతినాయకుడిగా నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని