salman khan: సికందర్‌ సల్మాన్‌

ప్రేక్షకులను మెప్పించాలంటే భాష కాదు.. కథే ముఖ్యం అంటారు చిత్రపరిశ్రమలోని కొందరు.

Updated : 12 Apr 2024 12:34 IST

ప్రేక్షకులను మెప్పించాలంటే భాష కాదు.. కథే ముఖ్యం అంటారు చిత్రపరిశ్రమలోని కొందరు. వాళ్లలో తమిళ దర్శకుడు ఎ.ఆర్‌ మురుగదాస్‌ ఒకరు. తమిళ చిత్ర దర్శకుడైన ఈయన బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌తో హిందీలో ఓ చిత్రం చేస్తున్నారు. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. రంజాన్‌ సందర్భంగా ఈ సినిమాకి ‘సికందర్‌’ అనే పేరును ఖరారు చేశారు. ఈ విషయాన్ని సల్మాన్‌ సామాజిక మాధ్యమాల వేదికగా తెలుపుతూ పోస్టర్‌ని పంచుకున్నారు. వచ్చే ఏడాది ఈద్‌కి విడుదల కానున్నట్లు వెల్లడించారు. ‘‘సికందర్‌’ చేసే మ్యాజిక్‌ను చూడటానికి ఆసక్తిగా ఉంది. ఓ అసాధారణమైన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. వచ్చే ఈద్‌ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు