samantha: కొత్త మెరుపులు మళ్లీ!

చేతిలో ఎప్పుడూ రెండు మూడు తెలుగు సినిమాలతో బిజీ బిజీగా గడిపిన తారలు సమంత... పూజాహెగ్డే. స్టార్‌ కథానాయకులు మొదలుకొని...యువ హీరోల చిత్రాల వరకూ తెలుగులో మొదలయ్యే ప్రతి ప్రాజెక్ట్‌ విషయంలోనూ వీళ్ల పేర్లు ప్రస్తావనకొచ్చేవి.

Updated : 04 Apr 2024 09:43 IST

చేతిలో ఎప్పుడూ రెండు మూడు తెలుగు సినిమాలతో బిజీ బిజీగా గడిపిన తారలు సమంత... పూజాహెగ్డే. స్టార్‌ కథానాయకులు మొదలుకొని...యువ హీరోల చిత్రాల వరకూ తెలుగులో మొదలయ్యే ప్రతి ప్రాజెక్ట్‌ విషయంలోనూ వీళ్ల పేర్లు ప్రస్తావనకొచ్చేవి. వీళ్లు కాల్షీట్లు లేవన్నాకే దర్శకనిర్మాతలు మిగతా ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించిన రోజులున్నాయి. కారణాలేవైనా కొన్నాళ్లుగా వీళ్ల సందడి కరువైంది. కొత్త కలయికల విషయంలోనూ వీళ్ల పేర్లు పెద్దగా వినిపించింది లేదు. ఒకప్పుడు తమ అందంతో తెలుగు తెరని ఊపేసిన ఈ నాయికల మెరుపులు మళ్లీ ఎప్పుడా? అని ఎదురు చూసిన అభిమానులు చాలామందే. ఎట్టకేలకి ఆ ఎదురు చూపులు ఫలించేలానే ఉన్నాయి. వీళ్లు మళ్లీ తెలుగు తెరపై సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వారం రోజులుగా వీళ్ల పేర్లు పలు కలయికల విషయంలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.  అల్లు అర్జున్‌ - అట్లీ కలయికలో తెరకెక్కనున్న సినిమా కోసం సమంత పేరు వినిపిస్తోంది. పాన్‌ ఇండియా మార్కెట్‌కి తగ్గట్టు గుర్తింపు ఉండడం సమంతకి కలిసొస్తున్న విషయం. పూజాహెగ్డే కూడా తెలుగు సినిమాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. నాగచైతన్య - కార్తీక్‌ దండు కలయికలో రూపొందనున్న సినిమా కోసం ఆమెని సంప్రదించినట్టు సమాచారం. పూజాహెగ్డే కూడా ఇటు దక్షిణాది నుంచి అటు బాలీవుడ్‌ వరకూ అన్ని చోట్లా సత్తా చాటింది. అందుకు తగ్గట్టే భారీ ప్రాజెక్ట్‌లపైనే ఆమె గురి పెట్టినట్టు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని