Mirzapur3: ‘మీర్జాపూర్‌ 3’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..!

 క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘మీర్జాపూర్‌ 3’ (Mirzapur3) విడుదలకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.

Updated : 17 Jan 2024 10:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీలో రికార్డు స్థాయిలో వ్యూస్‌ సాధించిన వెబ్‌సిరీస్‌ ‘మీర్జాపూర్‌’ (Mirzapur). ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు మంచి ఆదరణ అందుకోవడంతో.. మూడోదాని కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన మూడో భాగం మార్చి చివరి వారంలో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఏడాది క్రితమే దీని షూటింగ్‌ పూర్తయినట్లు నటీనటులు తెలిపారు. ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌, డబ్బింగ్‌ పనులు పూర్తి చేసుకొన్న ఈ సిరీస్‌ విడుదలకు సిద్ధమైంది.

గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ తొలి సీజన్‌ 2018 నవంబరు 16న విడుదలైంది. పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్రియ పిల్గోంగర్‌, హర్షిత గౌర్‌ తదితరులు నటించిన ఫస్ట్‌ సీజన్‌కు మంచి స్పందన లభించింది. దానికి కొనసాగింపుగా 2020 అక్టోబరు 23న రెండో సీజన్‌ విడుదలైంది. ఇదీ సూపర్‌ హిట్‌ అయ్యింది. తొలి సీజన్‌లో గుడ్డూ భయ్యా, తన తమ్ముడు బబ్లూ, భార్య శ్వేతలను మున్నా ఎలా ఇబ్బంది పెట్టాడని చూపించారు. రెండో సీజన్లో మున్నాపై గుడ్డూ భయ్యా ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడో చూపించారు. దీంతో మూడో దానిపై ఆసక్తి నెలకొంది. ఇందులో విజయ్ వర్మ కీలకపాత్రలో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని