Samantha: చికిత్స కోసం స్టార్‌హీరో రూ.25 కోట్ల సాయమంటూ వార్తలు.. సమంత ఏమన్నారంటే

మయోసైటిస్‌ చికిత్స కోసం టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరో భారీ మొత్తంలో తనకు డబ్బులిచ్చారంటూ వస్తోన్న వార్తలపై నటి సమంత (Samantha) పరోక్షంగా స్పందించారు. ఇన్‌స్టా వేదికగా ఒక పోస్ట్‌ పెట్టారు.

Updated : 05 Aug 2023 13:59 IST

హైదరాబాద్‌: మయోసైటిస్‌ చికిత్స కోసం సమంత(Samantha)కు.. ఓ టాలీవుడ్‌ స్టార్‌ హీరో రూ.25 కోట్లు సాయం చేశారంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఈ కథనాలపై తాజాగా సమంత పరోక్షంగా స్పందించారు. అందులో ఏమాత్రం నిజం లేదన్నారు. తన సమస్యను తానే పరిష్కరించుకోగలనని.. వేరే వాళ్ల నుంచి ఆర్థిక సాయం పొందాల్సిన అవసరం లేదన్నారు.

‘‘మయోసైటిస్‌ చికిత్సకు రూ.25 కోట్లా? ఎవరో మీకు తప్పుడు సమాచారం అందించారు. మీరు చెప్పిన దానిలో అతి తక్కువ మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నా. నా కెరీర్‌లో ఇప్పటివరకూ వర్క్‌ చేసినందుకు జీతంగా రాళ్లూరప్పలు ఇవ్వలేదని నేను అనుకుంటున్నా. కాబట్టి, నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను. మయోసైటిస్‌ కారణంగా ఎన్నో వేల మంది బాధపడుతున్నారు. ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించే ముందు దయచేసి కాస్త బాధ్యతగా వ్యవహరించండి’’ అని సమంత ఇన్‌స్టా స్టోరీ పెట్టారు.

సినిమా చాలా బాగుంది కానీ, వాటి లెంగ్త్‌ తగ్గిస్తే బాగుండేది: పరుచూరి విశ్లేషణ

సమంత గత కొన్నేళ్లుగా మయోసైటిస్‌తో బాధపడుతున్నారు. ‘యశోద’ ప్రమోషన్స్‌లో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు. చికిత్సలో భాగంగా ఆమె కొంతకాలంపాటు వర్క్‌ లైఫ్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నారు. ఈక్రమంలోనే ‘సిటడెల్‌’ (ఇండియన్‌ వెర్షన్‌) చిత్రీకరణను పూర్తి చేసి ఆమె యాక్టింగ్‌కు విరామం ఇచ్చారు. సామ్‌ ఇటీవల ఇండోనేషియాలోని బాలి టూర్‌కు వెళ్లారు. తన స్నేహితురాలితో కలిసి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. అలాగే, చికిత్స కూడా తీసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని