Samantha: ఇండస్ట్రీలో సమంత క్రష్‌ ఎవరో తెలుసా!

ఇండస్ట్రీలో తన క్రష్‌ ఎవరో సమంత చెప్పారు.

Updated : 16 Mar 2024 17:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha) ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించి.. పూర్తి సమయాన్ని ఆరోగ్య సంరక్షణకు కేటాయించారు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను పలకరిస్తున్నారు. తాజాగా ఆమె ‘ఇండియాటుడే కాన్‌క్లేవ్‌ 2024’లో పాల్గొన్నారు. న్యూదిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తన క్రష్ ఎవరో చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. 

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) అంటే గౌరవం అని తెలిపిన సమంత.. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై (Allu Arjun) క్రష్ ఉందన్నారు. ప్రభాస్‌ (prabhas)పై తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఎంతో గౌరవమని చెప్పారు. ఇక ఇదే కాన్‌క్లేవ్‌లో ఆమె తన ఆరోగ్య పరిస్థితిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. నటిగా కెరీర్ మొదలుపెట్టి 14 ఏళ్లు అయిందని.. రోజులో ఐదు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్నన్నారు. శరీరానికి, మనసుకు బ్రేక్‌ ఇవ్వలేదన్నారు. అనారోగ్యం కారణంగా కెరీర్లో అగ్రస్థానంలో ఉన్న క్షణాలను ఎంజాయ్‌ చేయలేకపోయినట్లు చెప్పారు.

‘సలార్‌ 2’లో ఆ ఫీల్‌ వందరెట్లు అధికంగా ఉంటుంది: బాబీ సింహా

ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది ‘శాకుంతలం’, ‘ఖుషి’ చిత్రాలతో పలకరించిన సమంత ప్రస్తుతం మరో ప్రాజెక్ట్‌ ఓకే చేయలేదు. ఆమె నటించిన వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌’ (ఇండియన్‌ వెర్షన్‌) విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ధావన్‌ హీరో. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించారు. దీనితో పాటు ‘ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌’ నిర్మాణ సంస్థను కూడా ఆమె ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని