Prabhas: ప్రభాస్‌.. ఆ సినిమా రీమేక్‌ చేద్దామంటే వద్దని చెప్పా: సందీప్‌ రెడ్డి వంగా

ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘స్పిరిట్‌’ (Spirit). 

Updated : 08 Apr 2024 18:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘యానిమల్‌’ (Animal)తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ప్రస్తుతం ఆయన ‘స్పిరిట్‌’ (Spirit) స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా డిసెంబర్‌ నుంచి పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్‌ తెలియజేశారు. మునుపెన్నడూ చూడని విధంగా ప్రభాస్‌ రోల్‌ ఉంటుందన్నారు.

‘‘కొన్నేళ్ల క్రితం ప్రభాస్‌ నుంచి నాకొక ఆఫర్‌ వచ్చింది. హాలీవుడ్‌లో ఆదరణ సొంతం చేసుకున్న ఓ చిత్రాన్ని తెలుగులో చేద్దామా? అని అడిగారు. దానికి నేను అంగీకరించలేదు. మనకు రీమేక్స్‌ వద్దు. రీమేక్‌ కంటే కూడా ఒరిజినల్‌ కథలే బాగా సెట్‌ అవుతాయని.. మంచి ఐడియా వస్తే తప్పకుండా సంప్రదిస్తానని చెప్పా. ‘యానిమల్‌’ షూట్‌లో ఉన్నప్పుడు నాకొక ఆలోచన వచ్చింది. వెంటనే ప్రభాస్‌ను సంప్రదించా. ఆయనకు ఐడియా బాగా నచ్చింది. ఓకే అన్నారు. ఇందులో నిజాయతీ కలిగిన పోలీస్‌ అధికారిగా ఆయన కనిపించనున్నారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటున్నారో అలాగే హీరో పాత్ర ఉంటుంది. తనని ఇబ్బందిపెడితే ఏవిధంగా రియాక్ట్‌ అవుతాడనేది హైలైట్‌గా చూపించనున్నాం. 60 శాతం రైటింగ్‌ పూర్తయింది. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ అనుకుంటున్నాం’’ అని సందీప్‌ చెప్పారు. తాను ఇప్పటికే రజనీకాంత్‌ కొత్త సినిమా (తలైవా 171) టీజర్‌ చూశానని చెప్పారు. లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని వీక్షించాలనుకుంటున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని