Animal: సినిమా అనేది పాఠశాల కాదు కదా..! విమర్శలపై సందీప్‌ వంగా కామెంట్స్‌

విమర్శలను పట్టించుకోనని ‘యానిమల్‌’(Animal) దర్శకుడు సందీప్ వంగా అన్నారు. ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు.

Published : 26 Dec 2023 11:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఈ ఏడాది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాల్లో ‘యానిమల్‌’ ఒకటి. రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటించిన ఈ మూవీకి సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంపై వస్తోన్న విమర్శలపై తాజాగా ఆయన స్పందించారు.

‘‘విమర్శల వల్ల సినిమాపై ప్రతికూలత ఏర్పడుతుంది. ఎక్కువసార్లు అబద్ధాన్ని చెబితే అదే నిజమనిపిస్తుంది. సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఒకవేళ ‘యానిమల్‌’ కలెక్షన్లు రూ.350 కోట్ల దగ్గరే ఆగిపోయినట్లైతే.. విమర్శకులంతా దీన్ని ఫ్లాప్‌ అని ప్రకటించేవాళ్లు. నా దృష్టిలో రూ.100 కోట్ల బడ్జెట్‌తో తీసిన సినిమా రూ.140 కోట్లు వసూల్‌ చేసినా.. అది హిట్‌ అయినట్లే. కానీ, విమర్శకులు మాత్రం ప్రేక్షకాదరణ పొందలేదని ప్రచారం చేస్తుంటారు. సినిమా చూసి అన్నీ నేర్చుకోవడానికి అది పాఠశాల కాదు కదా. అయినా.. తరగతి గదుల్లో, తల్లిదండ్రుల నుంచి మంచి చెడులు తెలుసుకోలేని వారు సినిమా చూసి నేర్చుకుంటారని నేను భావించను. దేవుడి దయ, నేను పడ్డ కష్టం వల్ల నా మూడు సినిమాలు విజయం సాధించాయి. నేను ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను. అందుకే నా సినిమాలను కూడా ఆ స్థాయి వాటితోనే పోల్చుకుంటాను. విమర్శలపై దృష్టి పెట్టను’’ అని స్పష్టం చేశారు.

సంక్రాంతి రేసు.. వరుస సినిమాల విడుదలపై దిల్‌రాజు ఏమన్నారంటే..?

ఇక డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యానిమల్‌’ (Animal) త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్‌ వెర్షన్‌ కోసం తొలగించిన షాట్స్‌ను ఓటీటీలో యాడ్‌ చేయనున్నారు. సుమారు తొమ్మిది నిమిషాల సన్నివేశాలను అదనంగా జోడించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని