Dil Raju: సంక్రాంతి రేసు.. వరుస సినిమాల విడుదలపై దిల్‌రాజు ఏమన్నారంటే..?

సంక్రాంతికి రానున్న చిత్రాల విషయంలో ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు దిల్‌రాజు (Dilraju) స్పందించారు.

Updated : 25 Dec 2023 20:20 IST

హైదరాబాద్‌: సంక్రాంతికి రానున్న చిత్రాల విషయంలో గత కొన్నిరోజుల నుంచి టాలీవుడ్‌లో సందిగ్ధత నెలకొంది. ‘గుంటూరుకారం’, ‘నా సామిరంగ’, ‘హనుమాన్‌’, ‘సైంధవ్‌’, ‘ఈగల్‌’ ఇలా ఐదు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్ల విషయంలో ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఇటీవల ఆయా చిత్ర నిర్మాతలతో సమావేశం నిర్వహించినట్లు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు దిల్‌రాజు (Dilraju) తెలిపారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంక్రాంతి సినిమా రిలీజ్‌ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

తొలిసారి కుమార్తెను చూపించిన అలియా - రణ్‌బీర్‌.. వీడియో వైరల్‌

‘‘తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఇటీవల కలిశాం. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలవనున్నాం. మీటింగ్ డేట్‌ ఫిక్స్‌ అయ్యాక ప్రకటిస్తాం. సంక్రాంతికి విడుదల కానున్న చిత్రాల విషయంలో ఇటీవల ఫిల్మ్ ఛాంబర్‌ వేదికగా చిత్ర నిర్మాతలందరితో సమావేశం జరిగింది. ఆ మీటింగ్ గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సంక్రాంతికి రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన ఐదు చిత్రాల నిర్మాతలను పిలిచి.. వీలుంటే ఎవరో ఒకరు రిలీజ్‌ను వాయిదా వేసుకోమని కోరాం. ఎవరైనా వెనక్కి తగ్గితే మిగిలిన చిత్రాలకు థియేటర్లు దొరికే అవకాశం ఉంటుందని చెప్పాం. రిలీజ్‌ను వాయిదా వేసుకున్న వారికి సోలో డేట్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మరో రెండు రోజుల్లో నిర్ణయాలు చెప్పమన్నాం. ఐదుగురు నిర్మాతలు తగ్గకపోతే  సినిమాలన్నీ రిలీజ్‌ అవుతాయి. ఒక సీనియర్‌గా ‘హనుమాన్‌’ దర్శకుడు ప్రశాంత్‌ వర్మకు సలహా ఇచ్చా. ఆ సలహాని ఫాలో అవ్వడం, కాకపోవడం తన ఇష్టం. అన్ని చిత్రాలకు న్యాయం జరగదు. ఏ సినిమా బాగుంటే సంక్రాంతి తర్వాత ఆ చిత్రమే ఆడుతుంది. ఈ పోటీని దృష్టిలో ఉంచుకునే నా చిత్రాన్ని (ఫ్యామిలీస్టార్‌) వాయిదా వేశా’’ అని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని