Animal: ‘యానిమల్‌’ సీక్వెల్‌ లక్ష్యమదే..: సందీప్‌ వంగా

‘యానిమల్‌’ (Animal) సూపర్‌ హిట్ కావడంతో దీని సీక్వెల్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా సందీప్ వంగా దీని గురించి మాట్లాడారు.

Updated : 07 Dec 2023 15:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘యానిమల్‌’ (Animal) చిత్రంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు సందీప్ వంగా (Sandeep Vanga). డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. యాక్షన్‌ ప్రియులకు కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చిన ఈ సినిమాకు ‘యానిమల్‌ పార్క్‌’(Animal Park) అనే టైటిల్‌తో ఈ సీక్వెల్‌ రానున్న సంగతి తెలిసిందే. దీంతో దీనిపై అందరిలో ఆసక్తి నెలకొంది.

దీని గురించి సందీప్ వంగా మాట్లాడుతూ.. ‘‘ఇందులో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయి. అలాగే గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్‌ పార్క్‌’ లక్ష్యం. ఊహించనన్ని యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. రణ్‌బీర్‌ కపూర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది. ‘యానిమల్‌’ చిత్రం ప్రేక్షకుల్లో శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల వచ్చిన అత్యంత సాహసోపేతమైన.. అసాధారణమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది’’ అన్నారు. అలాగే సీక్వెల్ గురించి బాబీ దేవోల్‌ (Bobby Deol) మాట్లాడుతూ..‘సందీప్ వంగా దర్శకత్వంలో నటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. సీక్వెల్‌ తెరకెక్కడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ‘యానిమల్’ చూసిన వారికి ‘యానిమల్‌ పార్క్‌’లో నా పాత్రపై ఓ అంచనాలు వచ్చేసి ఉంటాయి’ అని చెప్పారు.

‘యానిమల్‌’ ఇంటిమేట్‌ సీన్‌.. త్రిప్తి ఏమన్నారంటే..?

ఇక అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే హవా చూపించిన ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.576కోట్లకు (గ్రాస్‌) పైగా వసూళ్లు చేసింది. భారత్‌లోనే రూ.314 కోట్లు (నెట్‌) రాబట్టింది. ఇప్పటికే దీని వసూళ్లు రికార్డును సృష్టిస్తున్నాయి. ఇలానే కొనసాగితే బాలీవుడ్‌ అగ్ర హీరోల రికార్డులను కూడా అధిగమించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. త్వరలోనే రూ.1000కోట్లు మార్క్‌ను చేరుకుంటుందని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని