Tripti Dimri: ‘యానిమల్‌’ ఇంటిమేట్‌ సీన్‌.. త్రిప్తి ఏమన్నారంటే..?

‘యానిమల్‌’తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు నటి త్రిప్తి డిమ్రి (Tripti Dimri). ఆ సినిమాలో ఆమె జోయాగా నటించి మెప్పించారు.

Updated : 07 Dec 2023 15:07 IST

ముంబయి: త్రిప్తి డిమ్రి (Tripti Dimri).. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ‘యానిమల్‌’ (Animal)తో యువ హృదయాలను కొల్లగొట్టిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)తో ఇంటిమేట్‌ సీన్‌లో నటించడంపై మాట్లాడారు. ఆ సీన్‌ను చిత్రీకరించినప్పుడు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో వివరించారు. 

‘‘యానిమల్‌’ కోసం నన్ను సంప్రదించినప్పుడే ఇందులో నాకూ రణ్‌బీర్‌కు మధ్య శృంగార సన్నివేశం ఉంటుందని సందీప్‌ చెప్పారు. బ్యూటీ అండ్‌ బీస్ట్‌ లాంటి ఇమేజ్‌ను క్రియేట్‌ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. నాకు ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పమన్నారు. ఆయన చెప్పింది విన్నాక సినిమాలో ఆ సీన్‌ అవసరమని అర్థమైంది. అందుకే, ఆ సీన్‌లో నటించడానికి నేను ఓకే చెప్పా. షూట్‌ సమయంలోనూ సందీప్‌ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సెట్‌లోకి ఎవరినీ అనుమతించలేదు. నటీనటులు కాకుండా సందీప్‌, సినిమాటోగ్రాఫర్‌ మాత్రమే షూట్‌లో పాల్గొన్నారు’’ అని ఆమె చెప్పారు.

త్రిప్తి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

‘కబీర్‌ సింగ్‌’ తర్వాత సందీప్‌ రెడ్డి వంగా బాలీవుడ్‌లో తెరకెక్కించిన చిత్రమిదే. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక (Rashmika) జంటగా నటించారు. అనిల్‌కపూర్‌, బాబీ దేవోల్‌ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 1న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమా దాదాపు రూ.315.50 కోట్లు (నెట్‌) రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక, ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ను తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని