Double iSmart: పూరీ కీలక ప్రాజెక్ట్‌.. బీటౌన్‌ స్టార్‌ ఎంట్రీ

పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart). తాజాగా ఈసినిమాకు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ విడుదలైంది. 

Published : 29 Jul 2023 15:10 IST

హైదరాబాద్‌: ఇస్మార్ట్‌ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) తెరకెక్కిస్తోన్న సరికొత్త చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart). రామ్‌ పోతినేని (Ram Pothineni) కథానాయకుడు. 2019లో విడుదలై రామ్‌ - పూరీ కెరీర్‌లకు మంచి బ్రేక్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (Ismart Shankar) చిత్రానికి సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) రూపుదిద్దుకుంటోంది.

కాగా, ఇటీవల పట్టాలెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ను చిత్రబృందం శనివారం వెల్లడించింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌ ఈ సినిమాలో ‘బిగ్‌ బుల్‌’ పాత్రలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ చిత్రనిర్మాణ సంస్థ సంజయ్‌ దత్‌ లుక్‌ని రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌ను చూస్తే.. ఇందులో ఆయన స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. 

రివ్యూ: స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌

‘లైగర్‌’ (Liger) పరాజయం తర్వాత పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిదే. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై ఛార్మి, పూరీ దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్‌ సరసన హీరోయిన్స్‌గా ఎవరు కనిపించనున్నారనేది తెలియాల్సి ఉంది. ఇక, ‘కేజీయఫ్‌ 2’తో సంజయ్‌కు దక్షిణాదిలోనూ మంచి గుర్తింపు లభించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని