Double Ismart: రామ్‌-పూరీ జగన్నాథ్‌ల సినిమాలో ‘కేజీయఫ్‌’ విలన్‌..!

రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart). ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

Published : 28 Jul 2023 17:34 IST

హైదరాబాద్‌: పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)- రామ్ పోతినేని (Ram pothineni) కాంబోలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించి ఏదో ఓ వార్త సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు విలన్ కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

‘కేజీయఫ్‌2’లో ప్రతినాయకుడి పాత్రలో ఆదరగొట్టిన బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో విలన్‌గా కనిపించనున్నాడని టాక్. ఈ విషయంపై సంజయ్‌దత్‌ను చిత్రబృందం సంప్రదించిందని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై చిత్ర యూనిట్‌ ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. ‘లైగర్‌’తో ఎదురుదెబ్బ తిన్న పూరీ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో రామ్ ఊరమాస్‌ గెటప్‌లో కనిపించనున్నాడు. దానికి తగట్లుగా ప్రతినాయకుడి పాత్ర కూడా గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నాడట. అందుకే సంజయ్‌దత్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

మరో తెలుగు దర్శకుడితో దుల్కర్‌ సినిమా.. ఆకట్టుకుంటున్న టైటిల్ పోస్టర్‌

ఇక 2019లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా రానున్న ఈ సినిమాలో రామ్‌కు జోడిగా మీనాక్షి చౌదరి కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. పూరీ స్వీయ నిర్మాణంలో ఛార్మీతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమాలో రామ్ లుక్‌కు సంబంధించిన వీడియో విడుదల చేయగా అది వైరలైన విషయం తెలిసిందే. మరోవైపు రామ్- బోయపాటి శ్రీను (Boyapati Srinu)ల మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘స్కంద’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 15న ఇది రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని