Dulquer Salmaan: మరో తెలుగు దర్శకుడితో దుల్కర్‌ సినిమా.. ఆకట్టుకుంటున్న టైటిల్ పోస్టర్‌

హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) మరో తెలుగు దర్శకుడితో కలిసి సినిమా ప్రకటించారు.

Published : 28 Jul 2023 15:26 IST

హైదరాబాద్‌: ‘సీతారామం’తో తెలుగు వారి అభిమాన కథనాయకుడిగా మారిన హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan).. తాజాగా మరో తెలుగు దర్శకుడితో ఓ సినిమాను ప్రకటించారు. ఇటీవల ‘సార్‌’తో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న వెంకీ అట్లూరితో (Venky Atluri) ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను చేస్తున్నట్లు తెలిపారు.

నేడు దుల్కర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Baskhar) అనే పేరును ఖారారు చేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ ఆధారంగా చూస్తే డబ్బు చుట్టూ తిరిగే కథలా అర్థమవుతుంది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. అలాగే నేషనల్‌ అవార్డు విజేత నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

టాలీవుడ్‌కు మరో బాలీవుడ్‌ నటుడు.. నాని సినిమాతో ఎంట్రీ

ఇక దుల్కర్‌ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. తన చిన్ననాటి మిత్రుడైన అభిలాష్‌ జోషిలీ దర్శకత్వంలో ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ (King of Kotha)లో నటిస్తున్నారు. ఇటీవల మహేష్‌ బాబు విడుదల చేసిన ఈ టీజర్‌కు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. ఈ సినిమా తర్వాత రానా దగ్గుబాటితో కలిసి ఓ ప్రాజెక్ట్‌ చేస్తారని టాక్ వినిపించింది. ఇక దుల్కర్‌ నటించిన వెబ్‌స్టోరీ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్‌ అండ్ డీకే దర్శకత్వంలో ఈ హీరో నటించిన  ‘గన్స్‌ అండ్ గులాబ్స్‌’ (Guns and Gulaabs) వెబ్‌ సిరీస్ ఆగస్టు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ( Netflix) వేదికగా ప్రసారం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని