Sanjay Bhansali: నా సినిమాల్లో చేసిన నటీనటులు ఆ విషయంలో బాధపడతారు: సంజయ్‌ లీలా భన్సాలీ

ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం కోసమే తాను సినిమాలు తెరకెక్కిస్తానని దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ అన్నారు.

Published : 21 May 2024 17:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ అగ్ర నటీనటులతో సినిమాలు తెరకెక్కించిన దర్శకుల్లో సంజయ్‌ లీలా భన్సాలీ (Sanjay Bhansali) ఒకరు . అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యా రాయ్‌ (Aishwarya Rai) వంటి స్టార్స్ ఎందరో ఆయన దర్శకత్వంలో నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భన్సాలీ తన చిత్రాల్లో నటించిన యాక్టర్స్‌ ఓ విషయంలో బాధపడతారని తెలిపారు.

‘ప్రేక్షకులకు కొత్త కథలతో వినోదాన్నివ్వడం కోసం నేను చిత్రాలు నిర్మిస్తాను. అంతేకానీ, నటీనటులతో బంధాలు పెంచుకోవడానికి కాదు. అందుకే ఒక సినిమా కోసం ఎంపిక చేసిన నటీనటులను రెండో ప్రాజెక్ట్‌లోకి చాలా అరుదుగా తీసుకుంటా. నా చిత్రాల్లో రిపీట్‌ చేయనందుకు చాలామంది స్టార్స్‌ బాధపడతారు. నేను వాళ్లందరినీ గౌరవిస్తాను. వాళ్లు ఎంతో కష్టపడి నా సినిమాల్లో పాత్రలకు ప్రాణం పోస్తారు. ఒకరికొకరు ప్రేమ, గౌరవంతో తెరపై మాయ చేస్తారు. అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), రణ్‌బీర్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, మాధురీ దీక్షిత్, రాణి ముఖర్జీ వంటి గొప్ప నటీనటులతో పనిచేశాను. ఆ విషయంలో నేను అదృష్టవంతుడిని. నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ నటి సీమా బిశ్వాస్‌. నా సినిమాలో ఆమె నటించడం గొప్ప అనుభూతి’ అని తెలిపారు.

అతడి ప్రవర్తనకు భయపడ్డా: కాజల్‌ అగర్వాల్‌

తాజాగా ఆయన ‘హీరామండి’ (Heeramandi) సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించారు. వేశ్యల జీవితాల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, అదితిరావు హైదరి, రిచా చద్ధా, షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌ ఇతర కీలకపాత్రలు పోషించారు. దీనిపై బాలీవుడ్‌ స్టార్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు