Tenant: టెనెంట్‌ నేరం చేశాడా?

రావణాసురుడు సీతని చెరబడితే, శిక్ష సీతకెందుకు పడిందని ప్రశ్నించాడు గౌతమ్‌. తనని నమ్మి వచ్చిన ఓ అమ్మాయిని చంపాడనే నేరాన్ని మోస్తున్న అతని కథేమిటో తెలియాలంటే ‘టెనెంట్‌’ చూడాల్సిందే.

Updated : 14 Apr 2024 13:14 IST

రావణాసురుడు సీతని చెరబడితే, శిక్ష సీతకెందుకు పడిందని ప్రశ్నించాడు గౌతమ్‌. తనని నమ్మి వచ్చిన ఓ అమ్మాయిని చంపాడనే నేరాన్ని మోస్తున్న అతని కథేమిటో తెలియాలంటే ‘టెనెంట్‌’ చూడాల్సిందే. సత్యం రాజేశ్‌ కథానాయకుడిగా వై.యుగంధర్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. మేఘా చౌదరి, చందన పయ్యావుల, ఎస్తర్‌ నోరోన్హా, భరత్‌ కాంత్‌ కీలక పాత్రలు పోషించారు. మోగుళ్ల చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల వేడుకని నిర్వహించారు. నటుడు ప్రియదర్శి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సత్యం రాజేశ్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడు కథ ఎంత అద్భుతంగా చెప్పారో, అంతే బలంగా సినిమాని తీశారు. డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు కళ్లల్లో నీళ్లొచ్చాయి. నిర్మాత చంద్రశేఖర్‌ రెడ్డి ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. ఈ సినిమాని ఎంతో ప్రేమించి చేశారు. తప్పకుండా ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది. చందన, ఎస్తర్‌, భరత్‌, అనురాగ్‌ తదితరులు చాలా బాగా నటించారు. ప్రతి క్షణం ఆస్వాదించేలా, థియేటర్‌ నుంచి బయటికొచ్చాక కూడా మనసుల్లో నిలిచిపోయేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రతి మహిళకీ కనెక్ట్‌ అయ్యే కథ ఇది. భావోద్వేగాలు అందరి మనసుల్నీ హత్తుకునేలా ఉంటాయి. ఇంత అద్భుతంగా సినిమా రావడానికి కారణం మా నిర్మాత, నటీనటులు. ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘సహజత్వంతో కూడిన కథ ఇది. భావోద్వేగాలే ప్రధాన బలం’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని