Shah Rukh Khan: మరోసారి అలాంటి పని చేయను.. విరామంపై స్పందించిన షారుక్ ఖాన్‌..

నాలుగేళ్ల సుదీర్ఘ విరామంపై షారుక్‌ స్పందించారు. మరోసారి అలా చేయనని స్పష్టం చేశారు.

Published : 30 Jan 2024 12:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాలుగేళ్ల విరామం తర్వాత గతేడాది సూపర్‌ హిట్లతో విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలీవుడ్‌ హీరో షారుక్ ఖాన్‌  (Shah Rukh Khan). తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండడంపై స్పందించారు. ‘33 ఏళ్లుగా మిమ్మల్ని అలరిస్తున్నాను. మధ్యలో విరామం తీసుకున్నప్పుడు నా అభిమానులు కొందరు భయాందోళనలకు గురయ్యారు. గతంలో నా సినిమాలు కొన్ని ప్రేక్షకాదరణ పొందలేదు. దీంతో నేను మంచి సినిమాలు ఎంచుకోవడం లేదేమోనని భావించాను. అందుకే విరామం తర్వాత ‘పఠాన్’, ‘జవాన్‌’, ‘డంకీ’తో మీ ముందుకొచ్చి వినోదాన్ని పంచాను. ఇకపై ఎప్పుడూ నాలుగేళ్ల విరామం తీసుకోను. రెండు నెలలే తీసుకుంటా. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సినిమాలకు అతీతంగా నాపై అభిమానాన్ని చూపుతున్నారు. వారి హృదయాల్లో నాకు శాశ్వత స్థానాన్నిచ్చారు’ అంటూ తన ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

రికార్డులు బ్రేక్ చేస్తోన్న ‘హనుమాన్‌’.. ప్రశంసించిన వెంకయ్యనాయుడు..

గతేడాది షారుక్‌ నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. వీటిలో రెండు సినిమాలు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి. ప్రస్తుతం సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌లో నటించేందుకు షారుక్‌ పచ్చజెండా ఊపినట్లు వార్తలు వస్తున్నాయి. వయసు మళ్లిన హీరో, అతడి కన్నా వయసులో చాలా చిన్నదైన కథానాయికల మధ్య మొదలైన ప్రేమ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని