HanuMan: రికార్డులు బ్రేక్ చేస్తోన్న ‘హనుమాన్‌’.. ప్రశంసించిన వెంకయ్యనాయుడు..

‘హనుమాన్‌’ చిత్రబృందాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు.

Updated : 30 Jan 2024 11:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘హనుమాన్‌’. చిన్న సినిమాగా విడుదలై సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) తాజాగా ఈ చిత్రాన్ని తన స్నేహితులతో కలిసి వీక్షించారు. అనంతరం తన అనుభూతిని ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పంచుకున్నారు.

‘దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. భారతీయ ఇతిహాస వీరుల్లో ఒకరైన ఆంజనేయస్వామి స్ఫూర్తితో రూపొందించిన ఇందులోని ప్రతి సన్నివేశం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్‌ ఉన్నతంగా ఉన్నాయి. అందరూ చక్కగా నటించారు. చిత్రబృందానికి అభినందనలు’ అంటూ ‘హనుమాన్‌’ టీమ్‌తో దిగిన ఫొటోను పంచుకున్నారు.

ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?

మరోవైపు ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో దూసుకెళ్తోంది. నార్త్‌లోనూ మంచి రెస్పాన్స్‌ వస్తోంది. దీంతో ప్రశాంత్ నీల్, యశ్‌ కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ మూవీ ‘కేజీఎఫ్‌’ హిందీ వసూళ్లను ఇది బ్రేక్‌ చేసింది. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 దక్షిణాది చిత్రాల జాబితాలో స్థానం సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇచ్చిన విజయంతో జోష్‌లో ఉన్న దర్శకుడు త్వరలోనే ‘జై హనుమాన్‌’ను తీయనున్నారు. అది ‘హనుమాన్‌’కు వందరెట్లు ఉంటుందని.. దాన్నొక అంతర్జాతీయ సినిమాలా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని