Dunki: సినిమా చూస్తారా..? థియేటర్‌ బయటే ఉంటారా..?షారుక్‌ సరదా ట్వీట్‌

‘డంకీ’ విడుదల సందర్భంగా ఓ అభిమాని షారుక్‌లా (Shah Rukh Khan) గెటప్ వేసుకుని సందడి చేశారు. ఆ వీడియోపై షారుక్‌ సరదాగా రిప్లై ఇచ్చారు.

Published : 21 Dec 2023 16:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ సినిమా వస్తుందంటే బీటౌన్‌లో పండగ వాతావరణం నెలకొంటుంది. అలాగే షారుక్‌ కూడా ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ వాళ్లలో జోష్ నింపుతుంటారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘డంకీ’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వాటిని అందుకుని హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక సినిమా విడుదల సందర్భంగా ఓ అభిమాని వీడియోకు షారుక్‌ ఇచ్చిన రిప్లై నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

‘డంకీ’ విడుదల సందర్భంగా షారుక్‌ అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ముంబయిలో ఓ అభిమాని షారుక్‌లా గెటప్‌ వేసుకుని కనిపించారు. ‘డంకీ’ లోని ఓ సన్నివేశాన్ని థియేటర్‌ బయట ప్రదర్శించి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై తాజాగా షారుక్‌ కూడా సరదాగా స్పందించారు. ‘సినిమా చూడడానికి లోపలికి వెళ్తారా? థియేటర్‌ బయటే కుస్తీ చేస్తూ ఉండిపోతారా? మీరంతా ‘డంకీ’ చూసి ఎంజాయ్‌ చేశారో లేదో చెప్పండి’ అని షారుక్‌ ఆ వీడియోను షేర్‌ చేశారు. అలాగే ఈ  సినిమా చూసి ట్వీట్‌ చేసిన వారందరికీ షారుక్‌ రిప్లైలు ఇస్తూ ధన్యవాదాలు చెబుతున్నారు.

15 ఏళ్ల క్రితమే బీజం పడింది.. ‘సలార్‌’ గురించి ఈ విశేషాలు తెలుసా?

ఇక ‘డంకీ’ విషయానికొస్తే.. ‘పఠాన్‌’, ‘జవాన్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాల తర్వాత షారుక్‌ నటించిన ఈ కామెడీ డ్రామా ఆయనకు మరో హిట్‌ను అందించింది. సినిమా చూసినవారంతా మనసుకు హత్తుకుందని కామెంట్స్‌ చేస్తున్నారు. రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాప్సీ కథానాయికగా కాగా.. విక్కీ కౌశల్‌, బొమన్‌ ఇరానీ కీలకపాత్రల్లో కనిపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని