Shahid Kapoor: బాలీవుడ్‌ బయట వ్యక్తులను అంగీకరించదు: షాహిద్‌ కపూర్‌

బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ ఇటీవల ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 29 Feb 2024 19:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కబీర్‌సింగ్‌’, ‘జెర్సీ’, ‘బ్లడీ డాడీ’ వరుస రీమేక్స్‌తో ప్రేక్షకులను అలరించిన నటుడు షాహిద్‌ కపూర్‌(Shahid Kapoor). ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చిత్ర పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ బయట వ్యక్తులను త్వరగా అంగీకరించలేదన్నారు. ఈ రంగంలోకి ప్రవేశించినప్పుడు ఆయన ఎదుర్కొన్న ఓ సంఘటనను గుర్తుచేసుకుంటూ మాట్లాడారు. ‘‘బాలీవుడ్‌లో బంధుప్రీతి ఎక్కువ. ఒకరికి ఒకరు సహకరించాలి కానీ వారు అలా ఉండరు. అది వారికి పెద్ద సమస్య. దీని కారణంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సమస్యలు ఎదురయ్యాయి. నేను దిల్లీ నుంచి ముంబయికి వచ్చినందుకు దురుసుగా ప్రవర్తించారు. ఎక్కడినుంచో ఇక్కడి వచ్చాను. ఇక్కడి వారి లక్షణాలు, అలవాట్లు నాకు లేవు. దీంతోపాటు మాట్లాడే విధానం వేరుగా ఉండడంతో కొంతకాలం వివక్షకు గురయ్యాను. చిత్రపరిశ్రమ ఓ పాఠశాలని భావించా, కానీ ప్రతిభ ఉన్నా అవకాశం ఇచ్చేవారు కాదు’’ అని షాహిద్ కపూర్‌ పేర్కొన్నారు. 

‘‘నేను విభిన్నమైన పాత్రల్లో నటించేందుకు ఇష్టపడతాను. పాత్ర డిమాండ్‌ చేస్తే ఏదైనా చేస్తాను. కొన్నేళ్లుగా పూర్తిస్థాయి ప్రేమ కథల్లో నటించడం లేదు. ఒకే రకమైన చిత్రాల్లో నటిస్తున్న తరుణంలో ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి. కొందరు యాక్టర్స్ ప్రతీ సినిమాలో ఒకే లుక్‌తో కనిపిస్తారు. నేను అలా చేయను’’ అని షాహిద్‌ తెలిపారు.

షాహిద్‌కపూర్‌, కృతిసనన్ జంటగా నటించిన చిత్రం తేరీ బాతో మే ఐసా ఉల్జాజియా’(Teri Baaton Mein Aisa Uljha Jiya). అమిత్‌జోషి, ఆరాధన సాహ్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం షాహిద్‌ ‘దేవా’ చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని