Sharwanand: శర్వానంద్‌కు బిరుదు ఇచ్చిన నిర్మాత.. ఏ స్టార్‌ అంటే?

‘మనమే’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శర్వానంద్‌కు బిరుదు ఇచ్చారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌.

Published : 06 Jun 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శర్వానంద్‌ (Sharwanand), కృతిశెట్టి (Krithi Shetty) జంటగా నటించిన చిత్రం ‘మనమే’ (Manamey). ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో బుధవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. దర్శకులు మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేశ్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై, చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు (Manamey Movie Pre Release Event).

ఇకపై చామింగ్‌ స్టార్‌ శర్వానంద్‌..

ఇదే వేడుకలో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ శర్వానంద్‌కు బిరుదు ఇచ్చారు. అదే చామింగ్‌ స్టార్‌. ఈ మేరకు రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. వేడుకను ఉద్దేశించి శర్వానంద్‌ మాట్లాడుతూ.. ‘‘ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌లకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కష్టపడ్డారు.. మంచి ఫలితం అందుకున్నారు. ఇదంతా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రిజల్ట్స్‌తో పండగ వాతావరణం నెలకొంది. జూన్‌ 7న మన సినిమా రూపంలో మరో పండగ వస్తుంది. దాని తర్వాత 27న ‘కల్కి 2898 ఏడీ’ పండగ. ఇకపై అన్నీ మంచి రోజులే. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనం ఉన్న సినిమాలే ఇవ్వాలని కోరుకుంటా. సమయం ఎంత విలువైందో ఈ సినిమాలో చూపించాం. అలా అని సందేశం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. చివరి 40 నిమిషాల చిత్రం మిమ్మల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది. ఈ మూవీ తప్పక బ్లాక్‌బస్టర్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ ప్రాజెక్టును నేనెంతగానో ప్రేమించా. శ్రీరామ్‌ ఆదిత్య ప్రతిభావంతుడు. ఈ ఈవెంట్‌ను పిఠాపురంలో నిర్వహించాలనుకున్నాం. కానీ, అనుమతి లభించలేదు. సక్సెస్‌ పార్టీ అక్కడే ఉండొచ్చు’’ అని అన్నారు.

అతడి యాక్టింగ్‌.. భావోద్వేగం: కృతిశెట్టి

‘‘ఈ సినిమాకి కుటుంబ ప్రేక్షకులే కాదు యూత్‌ కూడా కనెక్ట్‌ అవుతారు. శర్వానంద్‌ అలవోకగా నటిస్తారు. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభూతి. దర్శకుడు కథ చెప్పినప్పుడు ఎలా ఫీలయ్యానో అవుట్‌పుట్‌ చూశాక అదే ఫీలయ్యా. ఆయన మ్యాజిక్‌ చేశారు. రెండేళ్లకే విక్రమ్‌ ఆదిత్య (డైరెక్టర్‌ తనయుడు)అదరగొట్టాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో అతడి యాక్టింగ్‌ చూసి భావోద్వేగానికి గురయ్యా’’ అని కృతిశెట్టి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని