Salaar: అలా చేసి ఉంటే.. ‘సలార్‌’కు ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చేవి: ‘బాహుబలి’ నిర్మాత

‘సలార్’ (Salaar) కలెక్షన్స్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ.

Published : 31 Dec 2023 16:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఖాన్సార్‌ సామ్రాజ్యం నేపథ్యంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) తెరకెక్కించిన చిత్రం ‘సలార్‌’ (Salaar). శ్రుతిహాసన్‌ కథానాయిక. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ‘సలార్‌’ హిందీ కలెక్షన్స్‌ను ఉద్దేశించి ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ వెబ్‌సైట్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సినిమాకు ప్రమోషన్స్‌ ఎంతో అవసరం అన్నారు.

‘‘దక్షిణాదిలో ‘సలార్‌’ చిత్రానికి ప్రమోషన్స్‌ అవసరం లేదు. ఎందుకంటే, ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ గురించి ఇక్కడ అందరికీ తెలుసు. వాళ్లిద్దరి సినిమా కోసం సౌత్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. హిందీ మార్కెట్‌కు వెళ్లేసరికి షారుక్‌ ఖాన్‌ నటించిన ‘డంకీ’ పోటీగా ఉన్నప్పుడు.. మన చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసం ప్రమోషన్స్‌ తప్పనిసరిగా చేయాలి. నార్త్‌లో ప్రమోషన్స్‌ చేసి ఉంటే ఆ మార్కెట్‌ నుంచి ఇంకాస్త ఎక్కువ కలెక్షన్స్‌ వచ్చేవి. ఒకవేళ ‘సలార్‌’ టీమ్‌లో నేను భాగమై ఉంటే.. ‘ఖాన్సార్‌’ ప్రపంచం, అందులోని పాత్రలను ముందే పరిచయం చేసేవాడిని. అలా, చేయడం ద్వారా ప్రేక్షకుల్లో బజ్‌ క్రియేట్‌ అయ్యేదని నా భావన’’ అని ఆయన చెప్పారు.

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ రిలీజ్‌.. అదే మాటపై నాగవంశీ

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతిహాసన్‌ మాట్లాడుతూ.. ‘‘సలార్‌’లో నటించడం నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది. సినిమా విడుదలైన తర్వాత ఎక్కడికి వెళ్లినా.. ‘‘(సలార్‌ను ఉద్దేశించి).. అసలు మీ నాన్న ఏం చేశారు?’’ అంటూ ప్రశ్నిస్తున్నారు’’ అని అన్నారు. 2012లో విడుదలైన ‘గబ్బర్‌ సింగ్‌’  తన కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచిందన్నారు. ఆ సినిమా ముందు వరకూ తాను నటించిన ఏ సినిమా కూడా సరైన విజయాన్ని అందుకోలేదని.. చాలామంది తనని కామెంట్‌ చేశారని శ్రుతిహాసన్‌ చెప్పారు. ‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత సినీ పరిశ్రమ తనని అక్కున చేర్చుకుందన్నారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని