Nikhil: నిఖిల్‌ ‘స్వయంభూ’ అప్‌డేట్‌.. ఆసక్తికరంగా లుక్‌

యంగ్‌ హీరో నిఖిల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభూ’ (Swayambhu). ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైనట్లు మేకర్స్‌ అధికారికంగా వెల్లడించారు.

Published : 18 Aug 2023 12:23 IST

హైదరాబాద్‌: యంగ్‌ హీరో నిఖిల్‌ (Nikhil) ‘కార్తికేయ2’తో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ‘స్పై’ మిస్టరీ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను పలకరించాడీ హీరో. ఇప్పుడు మరో విభిన్నమైన కథతో అలరించడానికి సిద్ధమయ్యారు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘స్వయంభూ’ (Swayambhu)లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది. 

ఓటీటీలో ‘బేబీ’ మూవీ.. స్ట్రీమింగ్‌ తేదీ ఫిక్స్‌.. వాళ్లకు స్పెషల్‌!

ఈ సినిమా షూటింగ్‌ మొదలైనట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్‌ ‘స్వయంభూ’ కొత్త  పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో గుర్రంపై ఉన్న నిఖిల్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. పోరాట యోధుడిలా ఆయన్ను చూపించారు మేకర్స్‌.  సోసియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మేనన్‌ నటించనుంది. ఇది అతడి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ మూవీగా రానుంది. ఇక ఈ సినిమాతో పాటు సుధీర్‌ వర్మతో నిఖిల్‌ ఓ సినిమా చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ సమర్పణలో ‘ది ఇండియా హౌస్‌’ పేరుతో ఇది తెరకెక్కనుంది. అలాగే ‘కార్తికేయ3’ కూడా లైన్‌లో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని