Shruti Haasan: బ్రేకప్‌ను ధ్రువీకరించిన నటి.. ఇన్‌స్టాలో క్లారిటీ

హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ తన బాయ్‌ ఫ్రెండ్‌కు బ్రేకప్‌ చెప్పారు. ఇన్‌స్టాలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

Updated : 24 May 2024 12:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి శ్రుతిహాసన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయినట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడిదే విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇన్‌స్టా వేదికగా ‘ఆస్క్‌ మీ ఎనిథింగ్‌’ పేరిట ఫాలోవర్స్‌తో ముచ్చటించిన శ్రుతి.. తన రిలేషన్‌ స్టేటస్‌ గురించి మాట్లాడారు. ఇందులో ఓ నెటిజన్‌ ‘మీరు సింగిలా.. రిలేషన్‌లో ఉన్నారా’ అని ప్రశ్నించడంతో స్పందించారు. ‘నాకు ఈ తరహా ప్రశ్నలు నచ్చవు. కానీ, చెబుతున్నాను. ఇప్పుడు నేను సింగిలే. రిలేషన్‌ కోసం ఎదురుచూస్తున్నా. ప్రస్తుతానికి పనిలో మునిగిపోయాను. జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నా’ అని తెలిపారు.

దిల్లీకి చెందిన ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో శ్రుతి హాసన్‌ (Shruti Haasan) ప్రేమలో ఉన్నట్లు నాలుగేళ్ల క్రితం ప్రకటించారు. అతడితో దిగిన ఫొటోలను తరచూ పోస్ట్‌ చేసేవారు. కొన్ని నెలలుగా ఆమె ఎలాంటి ఫొటోలను షేర్‌ చేయకపోవడంతో వీళ్లిద్దరూ విడిపోయారనే ప్రచారం మొదలైంది. నెల క్రితం శ్రుతిహాసన్‌, శాంతను ఇన్‌స్టాలో పరస్పరం అన్‌ఫాలో అయ్యారు. కలిసున్న ఫొటోలను ఇద్దరు డిలీట్‌ చేయడంతో బ్రేకప్‌ వార్తలు మరింత జోరందుకున్నాయి. తాజాగా ఇదే విషయాన్ని ఆమె ధ్రువీకరించారు. ఇటీవల ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ కూడా వైరలైంది. ‘‘ఇదొక క్రేజీ ప్రయాణం. ఇందులో నా గురించి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఇతరుల గురించీ అర్థం చేసుకున్నా’’ అని పేర్కొన్నారు.

కలలు కనడం మానొద్దు: నాగ్‌ అశ్విన్‌పై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

 సినిమాల విషయానికొస్తే.. శ్రుతి గతేడాది ఐదు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ‘సలార్’కు కొనసాగింపుగా రానున్న ‘సలార్‌ శౌర్యంగపర్వం’లో నటించనున్నారు. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. అడివిశేష్‌ హీరోగా రానున్న ‘డకాయిట్‌’లో ఆమె నటిస్తున్నారు. ‘చెన్నై స్టోరీ’లోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని