Shruti Haasan: చరిత్రలో దాగున్న కథలను చూపిస్తాం

‘సలార్‌’... ఇటీవల విడుదలైన ఈ సినిమాలో ఆద్య పాత్రలో తనదైన నటనతో సినీప్రియులను మెప్పించింది నాయిక శ్రుతిహాసన్‌. ఇప్పుడామె అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకోవడానికి ముస్తాబవుతోంది.

Updated : 25 Jan 2024 10:55 IST

‘సలార్‌’... ఇటీవల విడుదలైన ఈ సినిమాలో ఆద్య పాత్రలో తనదైన నటనతో సినీప్రియులను మెప్పించింది నాయిక శ్రుతిహాసన్‌. ఇప్పుడామె అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకోవడానికి ముస్తాబవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘చెన్నై స్టోరీ’. బాఫ్టా పురస్కార విజేత ఫిలిప్‌ జాన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ది అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే నవల ఆధారంగా ఇండియన్‌-బ్రిటన్‌ నేపథ్యంలో రొమాంటిక్‌ కామెడీ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రుతిహాసన్‌ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ..‘చెన్నై నుంచి వచ్చిన నాకు.. దాని వైవిధ్యత, విశిష్టతను చూపించే ఈ కథ చాలా ప్రత్యేకమైనది. ఇలాంటి అంతర్జాతీయ దర్శకనిర్మాతలతో కలిసి చరిత్రలో దాగి ఉన్న ఎన్నో కథలను ప్రపంచానికి సినిమా రూపంలో చూపించడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. త్వరలో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఆమె నటించిన మరో ఆంగ్ల చిత్రం ‘ది ఐ’ లండన్‌ ఇండిపెండెంట్‌ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని