Shruti Haasan: నాకు పెళ్లికాలేదు: శ్రుతిహాసన్‌ పోస్ట్‌.. ఏమైందంటే?

తన పెళ్లి వార్తలపై హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ స్పందించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Published : 27 Dec 2023 01:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సినీ ప్రముఖుల పెళ్లి విషయంలో రూమర్స్‌ ఎక్కువగా వస్తుంటాయి. ఆయా నటులు వాటిని ఖండించినా ఊహాగానాలు మళ్లీ మళ్లీ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా శ్రుతిహాసన్‌ (Shruti Haasan)కు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఆమె పెళ్లి చేసుకుందంటూ గతంలో వార్తలు రాగా.. ఇప్పుడు మరోసారి పలు వెబ్‌సైట్లు కథనాలు రాశాయి. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఓర్హాన్ అవత్రమణి అలియాస్‌ ఓరీ.. శ్రుతిహాసన్‌కు పెళ్లైందంటూ ఓ ఇంటర్వ్యూలో హింట్‌ ఇచ్చాడని పేర్కొన్నాయి. వీటిపై స్పందించిన శ్రుతిహాసన్‌ సోషల్‌ మీడియా వేదికగా ఖండించారు. ‘‘నాకు ఇంకా పెళ్లికాలేదు. ప్రతి విషయం గురించి పంచుకునే నేను.. పెళ్లి గురించి ఎందుకు దాస్తాను?’’ అని అన్నారు. ‘ఇలాంటి వాటిపై మీరెందుకు స్పందిస్తారు?’ అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

రాజమౌళి నా డ్యాన్స్‌ను ప్రశంసించడం మర్చిపోలేను: శ్రుతి హాసన్‌

ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌ శంతను (Shantanu)తో శ్రుతి హాసన్‌ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అతడితోనే ఆమె వివాహం జరిగినట్లుగా మరోసారి వార్తలొచ్చాయి. ‘సలార్‌’ (Salaar)తో తాజాగా మంచి విజయాన్ని అందుకున్న శ్రుతి.. ప్రస్తుతం ‘డెకాయిట్‌’తో బిజీగా ఉన్నారు. అడివి శేష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది. షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు, ఆమె నటించిన హాలీవుడ్‌ మూవీ ‘ది ఐ’ త్వరలోనే విడుదల కానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని