Shruti Haasan: రాజమౌళి నా డ్యాన్స్‌ను ప్రశంసించడం మర్చిపోలేను: శ్రుతి హాసన్‌

రాజమౌళి గారు తన డ్యాన్స్‌ గురించి మాట్లాడడం ఎంతో ఆనందాన్నిచ్చిందని నటి శ్రుతి హాసన్‌ (Shruti Haasan) తెలిపారు. అలాగే 2023 తనకెంతో ప్రత్యేకమన్నారు.

Published : 26 Dec 2023 15:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సలార్‌’లో పాత్ర తనకెంతో నచ్చిందని నటి శ్రుతి హాసన్‌ అన్నారు. ఇందులో ఆద్యగా నటించిన శ్రుతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రభాస్‌తో నటించడం కోసం చాలాకాలం ఎదురుచూసినట్లు చెప్పారు. ఈ సినిమాలో నటించడానికి ఆయన కూడా ఓ కారణమన్నారు. అలాగే ‘సలార్‌’ (Salaar) ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి చిత్రబృందంతో చేసిన ఇంటర్వ్యూ గురించి ఆమె ప్రస్తావించారు.

‘‘ప్రభాస్‌ అందరితో ఎంతో స్నేహంగా ఉంటాడు. ఆఫ్‌స్క్రీన్‌లో ఎంత సరదాగా ఉంటాడో కెమెరా ముందుకు వెళ్లగానే పూర్తి భిన్నంగా మారిపోతాడు. సెట్‌లో అందరితో కలిసిపోతారు. నేను ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేసినప్పుడు దీనికి ఆదరణ లభిస్తుందని కచ్చితంగా అనుకున్నాను. ప్రశాంత్‌ నీల్‌ ప్రపంచంలో నేనూ భాగమైనందుకు సంతోషించా. ‘సలార్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో రాజమౌళి గారు నన్ను పొగడడం ఎప్పటికీ మర్చిపోలేను. నా డ్యాన్స్‌ ఆయనకు నచ్చిందని చెప్పడమే నాకు ప్రశంస. ఈ ఏడాది నాకెంతో ప్రత్యేకమైనది. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్‌ హీరోల సినిమాలతో ప్రారంభమైన ఈ సంవత్సరం ప్రభాస్‌ సినిమాతో ముగిసింది. వీటితో పాటు నేను పాడిన ఆల్బమ్‌కు మంచి ఆదరణ లభించింది’’ అని శ్రుతి హాసన్‌ సంతోషం వ్యక్తం చేశారు.

సినిమా అనేది పాఠశాల కాదు కదా..! విమర్శలపై సందీప్‌ వంగా కామెంట్స్‌

తన అప్‌కమింగ్‌ చిత్రాల గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ది ఐ’ (The Eye) సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రమిది. అలాగే అడివి శేష్‌తో పాటు ‘డకాయిట్‌’ (Dacoit)లో చేస్తున్నా. ఇటీవల విడుదలైన దీని టైటిల్‌ టీజర్‌ అందరినీ ఆకట్టుకుంది. 2024లో ఇలాంటి రెండు విభిన్న చిత్రాల్లో అభిమానులను పలకరించనున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని