Shruti Haasan: 63ఏళ్ల సినీ ప్రయాణంలో నాన్న ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు: శ్రుతి హాసన్‌

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) సినీ రంగ ప్రవేశం చేసి నేటికి 63 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Published : 12 Aug 2023 11:31 IST

హైదరాబాద్‌: వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే కమల్‌ హాసన్‌ (Kamal Haasan)..  సినీ రంగ ప్రవేశం చేసి నేటికి 63ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సినీప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ తన తండ్రి సినీ కెరీర్‌పై ట్వీట్‌ చేశారు.

కమల్‌ హాసన్‌ అభిమానులు ఎడిట్‌ చేసిన ప్రత్యేక ఫొటోను పంచుకున్న శ్రుతి హాసన్‌..‘‘నాన్న తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. ఛాలెంజింగ్‌ పాత్రలు చేశారు. సినీ పరిశ్రమ ఎదుగుదల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. ఆరు దశాబ్దాలుగా సినీరంగానికి తన సేవలను అందిస్తున్నారు’’అని పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా సినీప్రముఖులు, నెటిజన్లు కమల్‌ హాసన్‌తో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. కమల్‌ హాసన్‌ ఇప్పటి వరకు 230కు పైగా చిత్రాల్లో నటించారు.

రివ్యూ: ఉస్తాద్‌.. శ్రీసింహా నటించిన కొత్త మూవీ మెప్పించిందా?

ప్రస్తుతం ఆయన ‘ఇండియన్‌2’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో కాజల్ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే దీని టీజర్‌ విడుదల కానుంది. అలాగే ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)లో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నారు. ఇటీవలే ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ ఈవెంట్లో (Comic-Con)నూ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని