Siddharth Roy ott: ఓటీటీలో సిద్ధార్థ్‌ రాయ్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

కొత్తదనం నిండిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 30 Apr 2024 20:43 IST

హైదరాబాద్‌: బాల నటుడిగా పలు విజయవంతమైన తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించాడు దీపక్‌ సరోజ్‌. వి.యశస్వీ దర్శకత్వంలో అతడు హీరోగా నటించిన చిత్రం  ‘సిద్ధార్థ్‌ రాయ్‌’. తన్వి నేగి, నందిని కథానాయికలు. కొత్తదనం నిండిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఈ ఏడాది ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకువచ్చింది.  వైవిధ్యమైన కథతో రూపొందిన ఈ చిత్రం యువతను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో మే 3వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ కొత్త పోస్టర్‌ను పంచుకుంది.

క‌థేంటంటే: సిద్ధార్థ్ రాయ్ (దీప‌క్ స‌రోజ్‌) తెలివైన‌వాడు. చిన్న‌ప్ప‌ట్నుంచే పుస్త‌కాల పురుగై... ప‌న్నెండేళ్ల‌కే ప్ర‌పంచంలోని ఫిలాస‌ఫీనంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్‌లైన్‌గా భావిస్తూ, ఎమోష‌న్స్‌ని అస్స‌లు ప‌ట్టించుకోడు. ఇంట్లో మ‌నిషి చ‌నిపోయి అంద‌రూ ఏడుస్తుంటే ‘ఎందుకు ఏడ‌వడం చ‌నిపోతార‌ని ముందే తెలుసు క‌దా, ఆ మాత్రం మాన‌సికంగా సిద్ధం కాలేరా’ అని ప్ర‌శ్నిస్తాడు. తిండి, నిద్ర‌, కోరిక... బ‌త‌క‌డానికి అవ‌స‌ర‌మైన ఇవి ఎక్క‌డ దొరికితే అక్క‌డ పొందుతూ ఎలాంటి స్పంద‌నలు లేకుండా బ‌తుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సంద‌ర్భంలో ఎమోష‌న్స్ కూడా కీల‌క‌మే అని న‌మ్ముతాడు. అందుకు కార‌ణం ఇందు (త‌న్వి నేగి). ఇంత‌కీ ఇందు ఎవ‌రు? ఆమె ప్రేమ‌లో ప‌డిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి? వాళ్లిద్ద‌రి ప్రేమ నిల‌బ‌డిందా? లాజిక్‌, ఎమోష‌న్‌... ఈ రెండూ సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్ర‌భావం చూపించాయి? అన్నది కథ

మూవీ పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు