Siddu Jonnalagadda: ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌ అనగానే భయపడ్డా.. చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ

‘టిల్లు స్క్వేర్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 28 Mar 2024 11:48 IST

f

ఇంటర్నెట్‌ డెస్క్‌: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). హిట్‌ సినిమా ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు సీక్వెల్ ఇది. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో బుధవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. దర్శకులు అనిల్‌ రావిపూడి, బాబీ తదితరులు అతిథులుగా హాజరై చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

వేడుకనుద్దేశించి సిద్ధు మాట్లాడుతూ..‘‘డీజే టిల్లు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది టైటిల్‌ సాంగ్‌. ఆ పాట పాడించేందుకు ఓ సింగర్‌కు కాల్‌ చేస్తే, ఆయన అందుబాటులో లేరు. దీంతో, రామ్‌ మిర్యాలను సంప్రదించాం. దానికి ఆయనే స్వరాలు సమకూర్చడం విశేషం. ఆ పాట హిట్‌కు మరో ప్రధాన కారణం గేయ రచయిత కాసర్ల శ్యామ్‌. యువత లక్ష్యంగా మేం ఆ చిత్రాన్ని తెరకెక్కించాం. కానీ, ఫ్యామిలీ ఆడియన్స్‌, చిన్నారులు.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు టిల్లు క్యారెక్టర్‌ బాగా కనెక్ట్‌ అయింది. దానికి మేం సర్‌ప్రైజ్‌ అయ్యాం. అలాంటి సినిమాకి పార్ట్‌ 2 తీయాలనే విషయం తెలిగానే భయపడ్డా. తర్వాత మంచి పాయింట్‌తో కథను సిద్ధం చేసుకుని, ధైర్యంగా ముందుకెళ్లాం. రెండు రోజుల క్రితం సినిమా చూశాం. ప్రేక్షకులకు ఇంటర్వెల్‌ కొత్త అనుభూతి పంచుతుంది. ఈ మూవీలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. నిన్న విడుదల చేసిన ఓ పోస్టర్‌పై చాలామంది సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేశారు. మహిళలను కించపరిచేలా కామెంట్లు పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని