అలియాని హీరోయిన్‌గా తీసుకోవద్దని ఇద్దరు హీరోలు మెసేజ్‌ పెట్టారు: ప్రముఖ దర్శకుడు

కరణ్‌ జోహర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ చాట్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 8’. తాజాగా ఈ కార్యక్రమంలో యువ హీరోలు సిద్ధార్థ్‌ మల్హోత్ర, వరుణ్‌ ధావన్‌ సందడి చేశారు. ఈ సందర్భంగా కరణ్‌.. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ రోజులు గుర్తు చేసుకున్నారు.

Published : 23 Nov 2023 13:30 IST

ముంబయి: బాలీవుడ్‌ చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ (Student Of The Year)తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి అలియాభట్‌ (Alia Bhatt). వరుణ్‌ ధావన్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కరణ్‌ జోహర్‌ దర్శకత్వం వహించారు. 2012లో విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను ‘కాఫీ విత్‌ కరణ్‌’లో తాజాగా కరణ్‌ జోహర్ తెలియజేశారు. ఈ సినిమా కోసం అలియాను ఎంపిక చేయొద్దని హీరోలిద్దరూ తనకు సందేశాలు పంపారని కరణ్‌ తెలిపారు.

ప్రేమలో పడడం సులభమే కానీ.. ఈ విషయాన్ని మర్చిపోవద్దు: జ్యోతిక

‘‘స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌’ రోజులు నాకింకా గుర్తున్నాయి. సినిమా పట్టాలెక్కడానికి ముందు ఓ సారి వరుణ్‌ ధావన్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర, అలియా భట్‌, నేనూ కలిశాం. స్టోరీ గురించి చర్చించుకున్నాం. అయితే, అలియాభట్‌ను హీరోయిన్‌గా తీసుకోవద్దని వరుణ్‌, సిద్ధార్థ్‌ నాకు సందేశాలు పంపారు. ఆమె చూడటానికి చిన్న పిల్లలా ఉందని.. అందుకే వేరే వాళ్లను తీసుకోమని అన్నారు. వాళ్ల మాటలు నేను పట్టించుకోకుండా ఓ రోజు ఫొటోషూట్‌ ఏర్పాటు చేశాను. ఆ తర్వాత కూడా వరుణ్‌ నాకు వేరే అమ్మాయిల ఫొటోలు పంపించి వాళ్లల్లో ఎవరినైనా ఈ సినిమా కోసం తీసుకుందామంటూ ప్రతిపాదించాడు’’ అని కరణ్‌ తెలిపారు. వెండితెరకు తాను పరిచయం చేసిన అలియా నేడు ఈ స్థాయిలో ఉండటం చూస్తుంటే గర్వంగా ఉందని ఆయన అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని