Jyothika: ప్రేమలో పడడం సులభమే కానీ.. ఈ విషయాన్ని మర్చిపోవద్దు: జ్యోతిక

ఆదర్శవంతమైన వివాహంపై నటి జ్యోతిక తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సూర్యతో తన పెళ్లి గురించి మాట్లాడారు.

Updated : 23 Nov 2023 12:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మమ్ముట్టి-జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాథల్-ది కోర్‌’ (Kaathal - The Core). నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ప్రేమ, పెళ్లి గురించి జ్యోతిక చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో షేర్ అవుతున్నాయి.

ఆదర్శవంతమైన వివాహంపై జ్యోతిక తన అభిప్రాయాన్ని తెలిపారు. ‘ప్రేమలో పడటం చాలా సులువు. కానీ, ప్రేమలో ఎదగడాన్ని మాత్రం మార్చిపోకూడదు. మన భాగస్వామిని గౌరవించడం, అభినందించడం దాంపత్యంలో చాలా ముఖ్యం. ఇది పరస్పర గౌరవం, ప్రశంసలపై ఆధారపడి ఉంటుంది. ఒక బంధంలో ఉన్నప్పుడు చిన్న విషయాలను పట్టించుకోకూడదు’ అని చెప్పారు. ఇక ఇదే విషయంపై మమ్ముట్టి మాట్లాడుతూ ఏళ్లు గడిచేకొద్ది ప్రేమ మరింత బలపడుతుందన్నారు.

మంచు విష్ణు బర్త్‌డే స్పెషల్‌.. ఆకట్టుకుంటున్న ‘కన్నప్ప’ ఫస్ట్‌లుక్‌..

ఈ సందర్భంగా సూర్యతో తన పెళ్లి గురించి జ్యోతిక మాట్లాడారు. ‘సూర్య, నేను కలిసి ఏడు చిత్రాల్లో నటించాం. అతడు అందరికీ మర్యాదనిస్తాడు. అలాగే నా భావాలకు కూడా గౌరవమిస్తాడు. నాకు నచ్చే విషయం అదే. అందుకే సూర్య నాపై ఉన్న ప్రేమను బయటపెట్టగానే అంగీకరించాను. తనను పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పారు. ఇక మరోవైపు మమ్ముట్టి సొంత బ్యానర్‌పై వచ్చిన ‘కాథల్-ది కోర్‌’ (Kaathal - The Core) సినిమాను కొన్ని అరబ్‌ దేశాలు నిషేధించాయి. ఈ సినిమా కథ స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉండడంతో.. ఆ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ చిత్రం కోసం మమ్ముట్టి- జ్యోతిక తొలిసారి కలిసి నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని