Mahaveerudu: ఓటీటీలోకి శివ కార్తికేయన్‌ కొత్త సినిమా.. ఎప్పుడు? ఎక్కడ?

ఈ వారం ఓటీటీ వేదికగా వినోదాన్ని పంచేందుకు మరో కొత్త సినిమా సిద్ధమైంది. శివ కార్తికేయన్‌ (Siva Karthikeyan) ప్రధాన పాత్రలో నటించిన ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.

Published : 07 Aug 2023 12:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘రెమో’, ‘డాక్టర్‌’, ‘డాన్‌’ చిత్రాలతో తెలుగువారికి చేరువైన కోలీవుడ్‌ నటుడు శివకార్తికేయన్‌ (Sivakarthikeyan) కథానాయకుడిగా నటించిన సరికొత్త యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మహావీరన్‌’ (తెలుగులో ‘మహావీరుడు’) (Mahaveeran). మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఆగస్టు 11 నుంచి తెలుగు, తమిళంలో ఇది అందుబాటులో ఉండనుంది.

ఈ వారం అగ్రహీరోల హంగామా..! థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

కథేంటంటే..

సత్య (శివకార్తికేయన్) తన తల్లి (సరిత), చెల్లితో కలిసి ఓ బస్తీలో నివసిస్తుంటాడు. అతనొక కామిక్ ఆర్టిస్ట్. సత్య వేసిన మహావీరుడి బొమ్మల కథలు మా భూమి పత్రికలో సుబ్బారావు పేరుతో ప్రచురితం అవుతుంటాయి. పిరికివాడైన సత్య.. ప్రజా సమస్యలను తన మహావీరుడి కథలో బొమ్మలు వేస్తుంటాడు. అయితే, రాజకీయ ఒత్తిళ్ల వల్ల మహావీరుడి కామిక్ కథను మా భూమి పత్రిక అర్ధాంతరంగా ముగిస్తుంది. సామాన్యుల కోసం అధికార పార్టీ నిర్మించిన ప్రజాభవనంలో జరిగే ఘోరాన్ని ఆపే ధైర్యం లేకపోవడంతో తల్లి మాటల వల్ల కలత చెందిన సత్య ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అప్పుడే సత్య రాసిన మహావీరుడి కథలోని మాటలు పై నుంచి వినిపిస్తుంటాయి. ఆ మాటలు విన్న సత్య ఏం చేశాడు? పిరికివాడైన సత్య కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ప్రజాభవనంలోని ప్రజలను ఎలా కాపాడాడు? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని