Skanda: ‘స్కంద’.. ప్రచార మెరుపు

‘స్కంద’గా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు రామ్‌ పోతినేని. ఆయన.. శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస చిట్టూరి నిర్మాత.

Updated : 26 Aug 2023 14:05 IST

‘స్కంద’గా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు రామ్‌ పోతినేని. ఆయన.. శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. ఈ సినిమా వచ్చే నెల 15న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వంలో భాగంగా ఈ నెల 26న ప్రీరిలీజ్‌ థండర్‌ పేరుతో ఓ ప్రచార చిత్రం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను నెట్టింట పంచుకుంది. అందులో రామ్‌ పంచెకట్టుతో.. శ్రీలీల లంగా ఓణీలో పొలాల మధ్య కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో రామ్‌ రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంగీతం: తమన్‌, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: సంతోష్‌ డిటాకే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని