Manchu Manoj: అన్నదమ్ముల మధ్య ఇగోలు ఉండకూడదు: మంచు మనోజ్‌

సంపూర్ణేశ్‌ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సోదరా’. ఈ సినిమా సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌కు మనోజ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Published : 25 Nov 2023 01:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంపూర్ణేశ్‌ బాబు (Sampoornesh Babu) తన సోదరుడులాంటివాడని హీరో మంచు మనోజ్‌ (Manchu Manoj) అన్నారు. ‘సోదరా’ సినిమా సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంపూర్ణేశ్‌బాబు, సంజోష్‌ ప్రధాన పాత్రల్లో మన్మోహన్‌ మేనంపల్లి తెరకెక్కించిన చిత్రమిది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని ప్రారంభించింది. అందులో భాగంగానే పాటను విడుదల చేసింది.

ఆ సంగతి తలుచుకుని ఏడ్చేశా.. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నా: విజయ్‌ వర్మ

వేడుకనుద్దేశించి మనోజ్‌ మాట్లాడుతూ.. ‘‘సంపూ ఎంత మంచివాడో ఆయన నవ్వే చెబుతుంది. ఆయన్ను చూస్తుంటే మా ప్రసాద్‌ అన్న (బాబాయ్‌ కొడుకు.. ప్రమాదంలో చనిపోయారు) గుర్తొస్తుంటాడు. ఈ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్‌ సినిమాలో సంపూ నటిస్తే ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతారు. సోదరుల అనుబంధం ప్రత్యేకం. అన్నదమ్ముల మధ్య ఇగోలు ఉండకూడదు. ఇద్దరి మధ్య సమస్యలను చూస్తున్నామంటే వారు కూర్చొని మాట్లాడుకోవట్లేదని అర్థం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాలి. అప్పుడే ప్రయాణం బాగుంటుంది. బ్రదర్స్‌ ఎమోషన్స్‌పై ఈ చిత్రాన్ని తీయడం సంతోషం. ‘సోదరా’ సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. మనోజ్‌ ప్రస్తుతం ‘వాట్‌ ది ఫిష్‌’ చిత్రంలో నటిస్తున్నారు. వరుణ్‌ కోరుకొండ దర్శకుడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని