Spy: ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రం...స్పై

నా కెరీర్‌లో ‘స్పై’ మరో గుర్తుండిపోయే చిత్రం అవుతుందన్నారు నిఖిల్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఐశ్వర్య మేనన్‌, సానియా కథానాయికలు.

Updated : 29 Jun 2023 17:19 IST
నిఖిల్‌

నా కెరీర్‌లో ‘స్పై’ (Spy) మరో గుర్తుండిపోయే చిత్రం అవుతుందన్నారు నిఖిల్‌ (Nikhil). ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఐశ్వర్య మేనన్‌, సానియా కథానాయికలు. గ్యారీ బీహెచ్‌ దర్శకుడు. కె.రాజశేఖర్‌ రెడ్డి కథని సమకూర్చడంతోపాటు, నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. ప్రముఖ కథానాయకుడు నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ ‘‘నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటి గొప్ప వ్యక్తి చుట్టూ అల్లుకున్న కథ ఇది. నాలుగు రోజుల కిందట మళ్లీ సినిమా చూసి, దర్శకుడిని హత్తుకుని కృతజ్ఞతలు చెప్పా. అంత బాగుంది సినిమా. జూన్‌ 29న ప్రేక్షకుల అంచనాలకి మించిన సినిమాని చూస్తారు. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ‘‘హ్యాపీడేస్‌ అనే సినిమాతో మొదలుపెట్టి స్వామిరారా, కార్తికేయతో ఓ ట్రెండ్‌ సెట్‌ చేశాడు నిఖిల్‌. తను ఏ నటుడికైనా ఎంతో స్ఫూర్తి. ఇలాంటి గూఢచారి సినిమాలు తీయడం అంత సులభం కాదు. చాలా సవాళ్లుంటాయి. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్లు చాలా బాగున్నాయి. సినిమా ఎంతో  నాణ్యంగా ఉంది. దర్శకుడు  గ్యారీకి కూడా అభినందనలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీచరణ్‌ పాకాల, కార్తీక్‌ దండు, ఆర్యన్‌ రాజేశ్‌, జిష్షూసేన్‌ గుప్తా, చరణ్‌, వంశీ పచ్చిపులుసు, సానియా, అభినవ్‌ గోమటం, రవివర్మ, నితిన్‌ మెహతా, వంశీ, అనిరుధ్‌, అర్జున్‌, రవి ఆంథోనీ, జి.వి.జి.రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు