Nikhil: స్పై టీజర్‌ దిల్లీలో

‘కార్తికేయ 2’ లాంటి హిట్‌ తర్వాత నిఖిల్‌ నుంచి వస్తున్న మరో పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై’. ఎడిటర్‌ గ్యారీ బిహెచ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కె.రాజశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

Updated : 13 May 2023 12:20 IST

‘కార్తికేయ 2’ లాంటి హిట్‌ తర్వాత నిఖిల్‌ (Nikhil) నుంచి వస్తున్న మరో పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై’ (Spy). ఎడిటర్‌ గ్యారీ బిహెచ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కె.రాజశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. సన్యా ఠాకూర్‌ మరో నాయిక. ఈ చిత్ర టీజర్‌ను ఈ నెల 15న దిల్లీలోని సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం ఉండే కర్తవ్య పథ్‌ వద్ద విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు శుక్రవారం అధికారికంగా ప్రకటించాయి. చంద్రబోస్‌ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాని జూన్‌ 29న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలందిస్తున్నారు. వంశీ పచ్చిపులుసు, మార్క్‌ డేవిడ్‌ ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు