Sudheer Babu: ‘హరోం హర’ వాయిదా.. బాధగా ఉందంటూ సుధీర్‌ బాబు పోస్ట్‌

సుధీర్‌ హీరోగా తెరకెక్కిన ‘హరోం హర’ (Harom Hara) వాయిదా పడింది.

Published : 21 May 2024 11:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన చిత్రం ‘హరోం హర’ (Harom Hara). ఈ సినిమా వాయిదా పడినట్లు సుధీర్‌ తెలిపారు. స్పెషల్‌ డేట్‌ మిస్‌ అయినందుకు బాధగా ఉందంటూ పోస్ట్‌ పెట్టారు.

‘కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది (Harom Hara postponed). జూన్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం. కృష్ణగారి పుట్టినరోజు సందర్భంగా మొదట దీన్ని మే 31న విడుదలచేయాలని భావించాం. కానీ, ఆ తేదీ మిస్‌ అయినందుకు బాధగా ఉంది. అయినా.. జూన్‌ నెల నాకు చాలా కలిసివస్తుంది. గతంలో నేను నటించిన ‘ప్రేమకథా చిత్రం’, ‘సమ్మోహనం’ రెండూ జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాయి. అలానే ‘హరోం హర’ కూడా మీ అంచనాలకు కచ్చితంగా అందుకుంటుంది’ అని పేర్కొన్నారు.  1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే చిత్రమిది. యాక్షన్‌కు ఎంతో ప్రాధాన్యముంది. ఈ సినిమాలో సుధీర్‌ (Sudheer Babu) కుప్పం యాసలో సంభాషణలు పలకనున్నారు. మాళవిక శర్మ హీరోయిన్‌. సునీల్‌, అక్షర కీలక పాత్రలు పోషించారు.

‘ఫ్యామిలీస్టార్‌’కు నెగెటివ్ టాక్‌ ఇలా క్రియేట్‌ చేశారు: ఆనంద్‌ దేవరకొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని