Sriranga Neethulu: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్‌ కొత్త మూవీ!

Sriranga Neethulu: సుహాస్‌ కీలక పాత్రలో నటించిన ‘శ్రీరంగనీతులు’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Updated : 29 May 2024 14:16 IST

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌రత్నం, రుహానీశర్మ, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీరంగ నీతులు’. ప్రవీణ్‌కుమార్‌ వీఎస్‌ఎస్‌ దర్శకత్వం వహించారు. ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకువచ్చిన తాజాగా తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్‌ వచ్చేసింది. మే 30వ తేదీన భవానీహెచ్‌డీ మూవీస్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అందుబాటులోకి రానున్నట్లు సదరు ఛానల్‌ ప్రకటించడంతో ఓటీటీ డీల్‌ జరగలేదేమో అనుకున్నారు. ఈ క్రమంలో బుధవారం నుంచి ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్‌ మొదలైంది.

క‌థేంటంటే: మూడు క‌థ‌ల స‌మాహారం ఈ సినిమా. టెక్నీషియ‌న్‌గా ప‌నిచేసుకుంటూ బ‌స్తీలో జీవితం కొన‌సాగిస్తున్న శ్యాంసంగ్ శివ (సుహాస్)కి ఫ్లెక్సీల పిచ్చి.  రాజ‌కీయ నాయ‌కుడితో క‌లిసి ఫొటో తీయించుకుని, దాన్ని అంద‌రూ చూసేలా ఫ్లెక్సీ వేయిస్తాడు. త‌న గురించి బ‌స్తీలో మాట్లాడుకోవాల‌నేది ఆశ‌. కానీ ఆ ఫ్లెక్సీ తెల్లారేస‌రికి క‌నిపించ‌దు. త‌నంటే ప‌డ‌ని మ‌రో గ్యాంగ్ వ‌ల్లే ఫ్లెక్సీ మాయ‌మైంద‌ని వాళ్లతో గొడ‌వ‌కి దిగుతాడు. మ‌ళ్లీ శివ ఫ్లెక్సీ వేయించాడా అనేది కీల‌కం. కార్తీక్ (కార్తీక్ ర‌త్నం)ది మ‌రో గొడ‌వ. జీవితంలో అనుకున్న‌ది సాధించ‌లేక‌పోయాన‌ని మ‌ద్యానికీ, గంజాయికీ బానిస అవుతాడు. త‌న కొడుకు మారితే చూడాల‌నుకున్న తండ్రి (దేవిప్ర‌సాద్‌)కి అంత‌లోనే మ‌రో త‌ల‌నొప్పి. ఇంట్లో సెల్ఫీ తీసుకుని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన చిన్న కొడుకు కోసం పోలీసులు ఇంటికొస్తారు. ప్రేమికులైన ఐశ్వ‌ర్య (రుహానీశ‌ర్మ‌), వ‌రుణ్ (విరాజ్ అశ్విన్‌)ల‌ది మ‌రో స‌మ‌స్య‌. ప్రేమించుకున్నా ఆ విష‌యాన్ని ఇంట్లో పెద్ద‌ల‌కి చెప్పే  ధైర్యం లేక స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. మ‌రి వీరి జీవితాలు ఎలాంటి మ‌లుపు తీసుకున్నాయనేది మిగిలిన కథ.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని