Cannes 2024: కేన్స్‌లో ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌కు మొదటి బహుమతి.. పేరేంటంటే

‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో’ లఘు చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మొదటి బహుమతి సొంతం చేసుకుంది.

Updated : 24 May 2024 10:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కేన్స్‌-2024లో ఉత్తమ లఘు చిత్రంగా ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ బహుమతి సొంతం చేసుకుంది. చిదానంద తెరకెక్కించిన ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో’ ఈ ఘనత సాధించింది. వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి తొలి స్థానంలో నిలవడంతో నెటిజన్లు ఈ టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

16 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను ఓ కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందించారు. వృద్ధురాలి కోడిని ఎవరో దొంగలించడం.. దానిని కనుగొనడం కోసం ఆమె పడే తపనను ఇందులో చూపారు. ఇప్పుడీ షార్ట్‌ ఫిల్మ్ హాలీవుడ్‌తో పోటీ పడి మొదటి బహుమతి గెలుచుకోవడంపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. ఇక మేరఠ్‌లో జన్మించిన భారతీయ చిత్రనిర్మాత మహేశ్వరి రూపొందించిన యానిమేటెడ్‌ చిత్రం ‘బన్నీ హుడ్‌’ ఈ పోటీలో తృతీయ బహుమతి గెలుచుకోవడం విశేషం. మే 23న బునుయెల్‌ థియేటర్‌లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఉత్తమ లఘు చిత్రానికి 15,000 యూరోలు, తృతీయ స్థానానికి 7,500 యూరోలు అందించారు. 

కలలు కనడం మానొద్దు: నాగ్‌ అశ్విన్‌పై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

ఫ్రాన్స్‌ వేదికగా 77వ కేన్స్​ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది (Cannes Film Festival). మే 14 నుంచి 25వ తేదీ వరకు జరిగే ఈ వేడుకలో తాజాగా మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న తెలుగు చిత్రం ‘కన్నప్ప’ టీజర్‌ను కూడా ప్రదర్శించారు. దీనిపై మంచు విష్ణు సంతోషం వ్యక్తం చేశారు. అక్కడకు వచ్చిన అతిథులకు ఈ టీజర్‌ నచ్చిందని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు