Suriya: సూర్య, కార్తిల మంచి మనసు.. మిగ్‌జాం బాధితులకు సాయం..

మిగ్‌జాం తుపాను బాధితులకు సాయం చేయడానికి సూర్య (Suriya), కార్తి ముందుకొచ్చారు. దీంతో వారిపై  అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated : 06 Dec 2023 13:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోలు సూర్య (Suriya), కార్తిలు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వీరు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. మిగ్‌జాం తుపాను బాధిత ప్రాంతాల్లో ఆహార పంపిణీ కోసం రూ.10లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. రియల్‌ హీరోలంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో కూడా సూర్య చాలాసార్లు తన సేవా గుణాన్ని చాటుకున్న సంగతితెలిసిందే. ఇక కార్తి (Karthi) కూడా తాజాగా తన 25వ సినిమా విడుదల సందర్భంగా 25 రోజుల పాటు ప్రతిరోజూ వెయ్యిమందికి అన్నదానం చేయడానికి విరాళమిచ్చారు.

డీప్‌ ఫేక్‌ బారిన ప్రియాంక చోప్రా.. నకిలీ వీడియో వైరల్‌

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సూర్య ‘కంగువా’ (Kanguva)లో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఐమ్యాక్స్‌, 3డీ వెర్షన్‌లోనూ ఇది అందుబాటులో ఉండనుంది. దిశా పఠానీ కథానాయికగా నటిస్తుండగా.. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఇది విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు