Kanguva: సూర్య ‘కంగువా’.. పదివేల మందితో ఫైట్‌ సీక్వెన్స్‌!

‘కంగువా’ ఫైటింగ్‌ సీక్వెన్స్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో షేర్‌ అవుతోంది.

Published : 18 May 2024 16:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ అగ్ర నటుడు సూర్య (Suriya) హీరోగా, దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇందులో ఒక ఫైట్‌ సీక్వెన్స్‌ను చిత్రబృందం భారీ స్థాయిలో ప్లాన్‌ చేసిందట. అది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పొన్నియిన్ సెల్వన్‌’లను తలపిస్తుందని టాక్‌. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్‌ నటుడు బాబీదేవోల్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే. సూర్య-బాబీల మధ్య క్లైమాక్స్‌ ఫైట్‌ ఊహించని స్థాయిలో ఉండనుందట. ఏకంగా 10వేల మందితో దాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. సినిమాకు ఇదే హైలైట్‌ కానుందని.. దీనికోసం టీమ్‌లోని వారంతా ఎంతో శ్రమించారని సినీ వర్గాలు వెల్లడించాయి.

నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్‌ కామెంట్‌పై రేణూ దేశాయ్‌ అసహనం

కంగ అనే పరాక్రముడి కథతో ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దిశా పఠానీ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో జగపతి బాబు, యోగిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఓ సందర్భంలో నిర్మాత ఈ సినిమా ఫలితం గురించి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. పార్ట్ 2, పార్ట్‌ 3 కథలు సిద్ధంగా ఉన్నాయని.. పార్ట్‌ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందన్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని