సూర్యకు జోడీగా పూజ?

సూర్య కథానాయకుడిగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూన్‌ తొలి వారం నుంచి అండమాన్‌ దీవుల్లో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.

Published : 18 May 2024 00:30 IST

సూర్య కథానాయకుడిగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూన్‌ తొలి వారం నుంచి అండమాన్‌ దీవుల్లో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన ప్రధాన తారాగణాన్ని ఖరారు చేసే పనిలో పడింది చిత్ర బృందం. ఇందులో భాగంగా సూర్యకు జోడీగా పూజా హెగ్డేను ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై ఆమెతో సంప్రదింపులు పూర్తయినట్లు తెలిసింది. ప్రేమ, వినోదం, యాక్షన్‌ అంశాలతో నిండిన ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. తొలి షెడ్యూల్‌ దాదాపు 40రోజులకు పైగా సాగనున్నట్లు తెలుస్తోంది. దీంట్లో మలయాళ నటుడు జోజు జార్జ్‌ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని