Aarya: ‘ఆర్య అంతిమ్‌ వార్‌’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

‘ఆర్య’ వెబ్‌ సిరీస్‌కు కొనసాగింపుగా తెరకెక్కిన ‘ఆర్య అంతిమ్‌ వార్‌’ విడుదలకు సిద్ధమైంది. త్వరలో ప్రసారం కానుంది.

Published : 08 Jan 2024 18:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్‌ (Sushmita Sen) ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘ఆర్య’ (Aarya). డిస్నీ + హాట్‌స్టార్‌ స్పెషల్‌గా ఇది స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సిరీస్‌ ఆఖరి సీజన్‌ ‘ఆర్య అంతిమ్‌ వార్‌’ ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా పోస్ట్‌ పెట్టింది. ఈ సిరీస్‌కు తన మనసులో ప్రత్యేకస్థానం ఉంటుందని తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో సుస్మితా సేన్‌ చెప్పారు. తన హృదయానికి చేరువైన కథ ఇది అని.. ఇందులో యాక్ట్‌ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

విజయ్‌ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం వార్తలు.. టీమ్‌ క్లారిటీ..

దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ‘ఆర్య’తో సుస్మితా సేన్‌ తిరిగి కెమెరా ముందుకు వచ్చారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ డ్రామాగా ఇది తెరకెక్కింది. ఇప్పటివరకూ ప్రసారమైన మూడు సీజన్స్‌ ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్నాయి. రామ్‌, సందీప్‌, వినోద్‌ రావత్‌, కపిల్‌ శర్మ ఆయా సీజన్లకు దర్శకత్వం వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని