Vijay Deverakonda - Rashmika: విజయ్‌ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం వార్తలు.. టీమ్‌ క్లారిటీ..

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) - రష్మిక (Rashmika) నిశ్చితార్థం అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

Updated : 08 Jan 2024 15:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్ దేవరకొండ (vijay devarakonda), రష్మిక (Rashmika mandanna) నిశ్చితార్థం అంటూ కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంలో తాజాగా స్పష్టత వచ్చింది. నెట్టింట వైరల్‌గా మారిన ఈ కథనాలపై విజయ్ టీమ్‌ను సంప్రదించగా... అందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఏమాత్రం నమ్మొద్దని కోరింది.

‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ కోసం విజయ్‌, రష్మిక కలిసి వర్క్‌ చేశారు. వరుసగా రెండు చిత్రాల్లో నటించడం, టూర్స్‌, డిన్నర్‌ పార్టీలకు కలిసి వెళ్తుండటంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గతంలో ప్రచారం జరిగింది. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని పలు సందర్భాల్లో ఈ స్టార్స్‌ క్లారిటీ ఇచ్చారు. అయినా వీరిపై వార్తలు ఆగలేదు. ఫిబ్రవరి రెండో వారంలో ఈ జంట నిశ్చితార్థం జరగనుందంటూ తాజాగా కథనాలు చక్కర్లు కొట్టాయి. విజయ్‌ టీమ్‌ క్లారిటీతో ఇకనైనా ఇలాంటి ప్రచారాలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందేమో చూడాలి.

ఇక సినిమాల విషయానికొస్తే, ఇటీవల ‘యానిమల్‌’తో రష్మిక విజయాన్ని అందుకున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ.800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఆమె ‘పుష్ప 2’లో నటిస్తున్నారు. ‘ఖుషి’ తర్వాత విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’లో యాక్ట్‌ చేస్తున్నారు. పరశురామ్‌ దర్శకుడు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. గౌతమ్‌ తిన్ననూరితో మరో ప్రాజెక్ట్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని