Taapsee: పెళ్లి రూమర్స్‌పై స్పందించిన తాప్సీ.. ఏమన్నారంటే

తన పెళ్లి అంటూ ప్రచారమవుతోన్న వార్తలపై తాప్సీ స్పందించారు.

Updated : 28 Feb 2024 15:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ తాప్సీ (Taapsee Pannu) పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతోన్న సంగతి తెలిసిందే. ఆమె మార్చి చివరి వారంలో రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోనున్నట్లు వాటి సారాంశం. తాజాగా వీటిపై ఆమె స్పందించారు. ‘నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి నేను ఎప్పుడూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. భవిష్యత్తులోనూ ఇవ్వను’ అని చెప్పారు. దీంతో ఈ వార్తలకు చెక్‌ పడినట్లైంది.

డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బోతో తాప్సీ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవలే వారి రిలేషన్‌ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పదేళ్ల నుంచి అతడితో రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. దక్షిణాది నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో అతడితో పరిచయం ఏర్పడిందని, అప్పటినుంచి అతడితోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. తామిద్దరం చాలా సంతోషంగా ఉంటున్నట్లు తెలిపారు.

మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్‌ తేజ్‌ అలా.. ‘టిల్లు’ ఇలా!

గతేడాది ‘డంకీ’తో హిట్‌ను సొంతం చేసుకున్నారు తాప్సీ. కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్‌ హిరాణీ రూపొందించారు. ప్రస్తుతం ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ కోసం ఆమె వర్క్‌ చేస్తున్నారు. ‘హసీన్‌ దిల్‌రుబా’కు సీక్వెల్‌గా ఇది రానుంది. జయ్‌ప్రద్‌ దేశాయ్‌ దర్శకుడు. విక్రాంత్‌ మాస్సే ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. దీనితో పాటు ఆమె నటించిన మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఇటీవల విడుదలైన ‘ధక్ ధక్’ చిత్రానికి తాప్సీ నిర్మాతగానూ వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని