Taapsee: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తాప్సీ.. చక్కర్లు కొడుతున్న వార్తలు!

నటి తాప్సీ పెళ్లి చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Updated : 25 Mar 2024 14:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ నటి తాప్సీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బోతో ఆమె ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. తాజాగా ఈ ప్రేమ జంట వివాహబంధంతో ఒక్కటైనట్లు  మీడియాలో వార్తలు వస్తున్నాయి. మార్చి 20న ప్రీవెడ్డింగ్‌ వేడుకలు ప్రారంభమయ్యాయట. 23న ఉదయ్‌పుర్‌లో తాప్సీ- మథియాస్‌ బోతో పెళ్లి జరిగిందని.. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్లు సమాచారం. ఇక ఈ వార్తలకు బలం చేకూరుస్తూ తాప్సీ బెస్ట్ ఫ్రెండ్‌, ప్రొడ్యూసర్‌ కనిక తాజాగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. వాటికి ‘నా స్నేహితుల పెళ్లిలో’ అని క్యాప్షన్‌ పెట్టారు. దీంతో ఆమె ఈ పెళ్లికే వెళ్లారంటూ పలువురు వెల్లడిస్తున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap) వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.

దక్షిణాది నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలోనే తాప్సీకు మథియాస్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇటీవల వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోనున్నారంటూ వార్తలు రాగా వాటిపై తాప్సీ స్పందించారు.  ‘వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో చెప్పమంటూ ఎవరినీ ఒత్తిడి చేయకూడదు. ఒకవేళ నేను దేని గురించైనా ప్రకటన చేయాలనుకుంటే స్వయంగా వెల్లడిస్తాను. పెళ్లి అనేది అందరి జీవితాల్లో ముఖ్యమైన భాగం. దాని గురించి నేనేం దాచాలనుకోవడం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది’ అని సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని