Tamannaah: అలాంటి విషయాలపై దృష్టి పెట్టను: తమన్నా

ట్రోలింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టనని తమన్నా అన్నారు. ప్రేక్షకులు కూడా అలాంటి పోస్టులను ప్రోత్సహించకూడదన్నారు.

Published : 01 Mar 2024 10:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్‌పై నటి తమన్నా (Tamannaah) తాజాగా స్పందించారు. సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

‘‘సెలబ్రిటీల విషయంలో నిజాలు తెలుసుకోకుండా ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెబుతుంటారు. మా జీవితంలో ఏం జరగనుందో కూడా వాళ్లే చెప్పేస్తుంటారు. అలాంటి వాటిపై నేను దృష్టి పెట్టను. వాటి గురించి ఆలోచిస్తే మనమే ప్రోత్సహించినట్లు అవుతుంది. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే ఏం చేయాలనే దానిపైనే శ్రద్ధ పెడతాను. టాలీవుడ్‌, బాలీవుడ్‌ రెండూ నాకు సమానమే. నేను ముంబయిలో పుట్టి పెరిగాను. నా సినీ జీవితం దక్షిణాది సినిమాలతో ప్రారంభమైంది. ఈ రెండు ప్రాంతాలు నాకు సొంత ఇళ్లుగా భావిస్తాను. కళాకారులకు భాషా, ప్రాంతంతో సంబంధం ఉండదు. నిరంతరం ప్రయాణిస్తూనే ఉండాలి. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే మా పని’ అని తమన్నా అన్నారు. ఇక ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యలో మాట్లాడుతూ ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమ గురించి అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా మాట్లాడుకుంటున్నారని ప్రశంసించిన సంగతి తెలిసిందే.

మెహందీ వేడుకలో ప్రగ్యా జైస్వాల్‌.. నేహాశెట్టి జర్నీ.. రాశీసింగ్‌ స్టిల్స్‌!

గతేడాది వరుస వెబ్ సిరీస్‌లు, సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న తమన్నా ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాజ్‌కుమార్‌ రావ్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా నటిస్తున్న ‘స్త్రీ 2’ కోసం ప్రత్యేక గీతంలో నటిస్తున్నారు. అమర్‌ కౌశిక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు